https://oktelugu.com/

Tirumala : అలిపిరి మెట్లు, శ్రీవారి మెట్లు .. ఏవి తక్కువ దూరం.. శ్రీవారి మెట్లకు ఉన్న ప్రాధాన్యత ఏంటి?

Tirumala : ఏడుకొండల పైన ఉన్న ఈ స్వామిని చేరుకోవడానికి ఏడు దారులు ఉన్నాయని కొందరు అంటూ ఉంటారు. కానీ ప్రత్యేక వాహనంలో వచ్చేవారు, బస్సుల్లో వచ్చేవారు ఘాట్ రోడ్డుపై వస్తుంటారు. స్వామి దర్శనార్థం నడిచి వస్తానని మొక్కుకున్న వారు అలిపిరి మార్గం నుంచి చేరుకుంటారు. అయితే నడిచి రావడానికి వచ్చే మరో మార్గం ‘శ్రీవారి మెట్లు’. ఈ మార్గం గురించి ప్రత్యేకతలు ఏంటంటే?

Written By:
  • Srinivas
  • , Updated On : March 13, 2025 / 07:38 PM IST
    Alipiri Mettu And Sri Vari Mettu

    Alipiri Mettu And Sri Vari Mettu

    Follow us on

    Tirumala  : జీవితంలో ఒక్కసారైనా.. తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ప్రతి తెలుగువారు కోరుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొందరు ఏడాదికోసారి సందర్శిస్తారు. దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా శ్రీవారి దర్శనం కోసం ప్రత్యేక ప్లాన్ వేసుకుంటూ ఉంటారు. అయితే ఏడుకొండల స్వామిని దర్శించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఏడుకొండల పైన ఉన్న ఈ స్వామిని చేరుకోవడానికి ఏడు దారులు ఉన్నాయని కొందరు అంటూ ఉంటారు. కానీ ప్రత్యేక వాహనంలో వచ్చేవారు, బస్సుల్లో వచ్చేవారు ఘాట్ రోడ్డుపై వస్తుంటారు. స్వామి దర్శనార్థం నడిచి వస్తానని మొక్కుకున్న వారు అలిపిరి మార్గం నుంచి చేరుకుంటారు. అయితే నడిచి రావడానికి వచ్చే మరో మార్గం ‘శ్రీవారి మెట్లు’. ఈ మార్గం గురించి ప్రత్యేకతలు ఏంటంటే?

    Also Read : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఆ పద్ధతిలో దర్శన టికెట్లు పునరుద్ధరణ!

    చాలా మంది తిరుపతి వేంకటేశ్వర స్వామిని నడిచి దర్శించుకోవాలని అనుకుంటే.. అలిపిరి మార్గం నుంచే వెళ్తారు. ఎందుకంటే అలిపిరి వరకు అనేక రవాణా సౌకర్యాలు ఉన్నాయి. రైల్వే స్టేషన్ తో పాటు బస్సులో వచ్చిన వారికి ఇక్కడికి ఈజీగా చేరుకోవచ్చు. అంతేకాకుండా అలిపిరి నుంచి వెళ్లే వారికి ఉచితంగా లగేజని తీసుకొచ్చే సదుపాయం ఉంటుంది. మొత్తం అలిపిరి మెట్లు 3,500 ఉంటాయి. 9 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ మార్గంలో సాధారణ వ్యక్తి వెళ్లాలంటే కనీసం 4 గంటల సమయం పడుతుంది.

    అయితే శ్రీవారి మెట్ల పై నుంచి కూడా శ్రీవారి ఆలయానికి చేరుకోవచ్చు. కానీ ఈ మార్గం నుంచి తక్కువ మందే వెళ్తారు. ఎందుకంటే శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీవారి మెట్ల దారి ప్రారంభం అవుతుంది. అంటే ఇక్కడికి చేరుకోవాలంటే ప్రత్యేకమైన వాహనం తీసుకొని వెళ్లాలి. లేదా బస్సులో కూడా వెళ్లొచ్చు. అయితే అలిపిరి కంటే శ్రీవారి మెట్ల దారి తక్కువ దూరం ఉంటుంది. ఈ మార్గం నుంచి 2,338 మెట్లు ఉంటాయి. ఈ దారి మొత్తం 3 కిలోమీటర్లు ఉంటుంది. ఇటునుంచి సాధారణ వ్యక్తి చేరుకోవాలంటే గంట సమయం పడుతుంది.

    శ్రీవారి మెట్ల నుంచి రద్దీ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ మెట్ల గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. అంతేకాకుండా ఈ స్వామి వారి మెట్లు చంద్రగిరి రాజు హయాంలో వెలుగులోకి వచ్చాయి. శ్రీకృష్ణ దేవరాయులు చంద్రగిరికి వచ్చిన సమయంలో శ్రీవారి మెట్ల గుండా తిరుమల కొండకు వచ్చారని అంటున్నారు. మొదట్లో ఈ మెట్ల మార్గం నుంచి వెళ్లాలంటే సౌకర్యాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు.

    శ్రీవారి మెట్లకు ప్రత్యేకత ఉందని పురాణాలు చెబుతున్నాయి. వేంకటేశ్వర స్వామి ఈ మెట్ల నుంచే గుడికి వెళ్లారని అంటారు. అంతేకాకుండా శ్రీనివాసుడు భువికి దిగివచ్చిన సమయంలో ఒక అడుగు శ్రీవారి మెట్లపై వేయగా.. మరో అడుగు మంగాపురంలో వేశారని అంటారు. ఈ దారి గుండా వెళ్లేవారికి స్వచ్ఛమైన వాతావరణం అందుతుంది.

    Also Read :