Balakrishna’s daughter Brahmani : చిత్రపరిశ్రమకు అబ్బాయిలను వారసులుగా పరిచయం చేసే నటులు, దర్శక నిర్మాతలు.. అమ్మాయిలను మాత్రం దూరంగా ఉంచుతారు. సామాజిక ధోరణి, మనుషుల ఆలోచన విధానం ఇందుకు కారణమైంది. ముఖ్యంగా సౌత్ లో ఈ కల్చర్ లేదు. బాలీవుడ్ లో మాత్రం చాలా కాలంగా ఉంది. హీరోలు, నటుల కూతుళ్లు హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. సోనమ్ కపూర్, అలియా భట్, సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్, శ్రద్దా కపూర్.. చెప్పుకుంటూ పొతే లిస్ట్ పెద్దదే.
Also Read : బాలయ్య ‘దబిడి..దిబిడి’ పాటకు ఎలుగుబంటి స్టెప్పులు..సోషల్ మీడియాని ఊపేస్తున్న వీడియో!
ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో ఈ కల్చర్ మొదలవుతుంది. స్టార్స్ వారసులు హీరోయిన్స్ గా, నిర్మాతలుగా రాణించే ప్రయత్నం చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ అయిన ఒకే ఒక అమ్మాయి నిహారిక. అప్పట్లో ఆమె ఎంట్రీని కూడా మెగా ఫ్యాన్స్ తీవ్రంగా వ్యతిరేకించారు. హీరో రాజశేఖర్ ఇద్దరు కుమార్తెలు శివాని, శివాత్మిక హీరోయిన్స్ అయ్యారు. తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత నిర్మాణ రంగంలో అడుగుపెట్టింది. బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని తన తమ్ముడు మోక్షజ్ఞ చిత్రంతో నిర్మాతగా మారుతున్నట్లు సమాచారం ఉంది.
కాగా బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మణి చాలా అందంగా ఉంటారు. ఆమెకు హీరోయిన్ ఆఫర్స్ వచ్చాయట. లెజెండరీ దర్శకుడు మణిరత్నం ఓ చిత్రంలో హీరోయిన్ గా ఆమెను పెట్టాలని అనుకున్నాడట. ఈ మేరకు బాలకృష్ణను సంప్రదించాడట. బాలకృష్ణ ఆసక్తి చూపకపోవడం వలనో, ఆమెకు నటి కావడం ఇష్టం లేకనో.. మణిరత్నం ఆఫర్ ని తిరస్కరించారు. ప్రేమ కథల్లో కల్ట్ క్లాసిక్స్ తెరకెక్కించిన మణిరత్నం ఏ చిత్రం కోసం బ్రాహ్మణిని హీరోయిన్ గా అనుకున్నారనే చర్చ నడుస్తుంది.
మరొక విశేషం ఏమిటంటే.. బాలకృష్ణ హీరోగా దార్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన టాప్ హీరో మూవీలో మహేష్ బాబు సిస్టర్ మంజుల నటించాల్సింది. కృష్ణ ఫ్యాన్స్ తీవ్రంగా వ్యతిరేకించడంతో మంజుల వెనక్కి తగ్గింది. అనంతరం షో మూవీలో నటించి, హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పై కనిపించాలన్న తన కోరిక ఆమె నెరవేర్చుకుంది. సౌత్ ఇండియా చిత్ర ప్రముఖులు కూడా ఆధునికంగా ఆలోచిస్తున్నారు. కమల్ హాసన్ కుమార్తె శృతి హీరోయిన్ అయ్యింది. అర్జున్ తన కుమార్తె ఐశ్యర్యను హీరోయిన్ చేశాడు. రజనీకాంత్ ఇద్దరు కుమార్తెలు నిర్మాణం, దర్శకత్వ శాఖల్లో పని చేస్తున్నారు.
టాలీవుడ్ లో మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి నటి అయ్యారు. నిర్మాత అశ్వినీ దత్ ఇద్దరు కుమార్తెలు ప్రియాంక, స్వప్న సక్సెస్ఫుల్ నిర్మాతలుగా దూసుకుపోతున్నారు. గతంలో మాదిరి తమ ఇంటి ఆడపిల్లలను చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంచాలని నటులు అనుకోవడం లేదు. ఇది అభినందనీయం.
Also Read: విరాట్ కోహ్లీ తో నందమూరి బాలకృష్ణ..సోషల్ మీడియా ని ఊపేస్తున్న లేటెస్ట్ సెల్ఫీ!