Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహాన్ని చాలా చల్లని గ్రహంగా పేర్కొంటారు. బుధ గ్రహం అనుగ్రహంగా ఉంటే సిరి సంపదలు వర్ధిల్లుతాయని భావిస్తారు. అలాగే సూర్య గ్రహం బలం ఉంటే ఏ పని అయినా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అయితే సెప్టెంబర్ 13 శనివారం రోజున ఈ రెండు గ్రహాలు సింహరాశిలో ప్రవేశిస్తాయి. బుధ, సూర్య గ్రహాలు శక్తివంతమైనవే.. అందులోనూ పవర్ఫుల్ అయిన సింహ రాశిలోకి ప్రవేశించడంతో 12 రాశులపై ప్రభావం పడుతుంది. అయితే నాలుగు రాశుల వారికి మాత్రం అదృష్టం కలగనుంది. మరి ఆ నాలుగు రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం..
Also Read: కిష్కింధపురి vs మిరాయి: ఏ సినిమా హిట్? ఏది ఫ్లాప్?
రెండు గ్రహాల కలయిక వల్ల మేషరాశిపై ప్రభావం పడుతుంది. ఈ రాశి వారు సెప్టెంబర్ 13 నుంచి ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగం, వ్యాపారంలో అనుకున్న దానికంటే ఎక్కువగా లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. పాత స్నేహితులను కలవడం వల్ల ఉల్లాసంగా గడుపుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. గతంలో ఉన్న సమస్యలు పరిష్కరించుకుంటారు. పెండింగ్లో ఉన్న డబ్బు వసూలు అవుతుంది. వ్యాపారిలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. అదనపు ఆదాయం కోసం చూసే ఉద్యోగులకు అనుకూలమైన సమయం.
రెండు గ్రహాలు కలిసి సింహరాశిలో ప్రయాణించడం వల్ల సొంత రాశికి అనుకూలమైన వాతావరణం ఉండనుంది. సింహ రాశి వారికి ఖర్చులు పెరిగిన ఆదాయం రావడంతో సమస్యలు ఉండవు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉంటారు. వ్యాపార పర్యటన నిమిత్తం దూరపు ప్రయాణాలు ఉంటాయి. ఉద్యోగులకు అదనపు ఆదాయం ఉంటుంది. అనుకోకుండా ధనలాభం వచ్చే అవకాశం ఉంది. పరిస్థితులన్నీ అనుకూలంగా మారుతాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ 13 నుంచి కలిసి వచ్చే అవకాశాలున్నాయి. వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యుల మద్దతు వ్యాపారాలు లాభాలు పొందుతారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. గతంలో చేపట్టిన పనుల నుంచి లాభాలు పొందుతారు. ఉద్యోగులు అధికారుల నుంచి ఒత్తిడి తగ్గించుకుంటారు. వీరు ప్రాజెక్టులు చేపడితే అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.
తులా రాశి వారికి ఇప్పటినుంచి ఏ పని చేపట్టిన విజయమే వర్తిస్తుంది. విహార యాత్రలకు వెళ్తారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. గతంలో కంటే ఇప్పుడు సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు.