Mirai Prabhas: నేడు విడుదలైన తేజ సజ్జ(Teja Sajja) ‘మిరాయ్'(Mirai Movie) చిత్రం మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని, సెన్సేషనల్ ఓపెనింగ్స్ దిశగా అడుగులు వేస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రానికి మొదటి రోజు కచ్చితంగా 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చేలా కనిపిస్తుందని ట్రేడ్ పండితులు అంటున్నారు. నాని, విజయ్ దేవరకొండ వంటి హీరోలు ఎన్నో సినిమాల తర్వాత ఈ రేంజ్ ఓపెనింగ్స్ ని అందుకుంటే, తేజ సజ్జ కేవలం రెండు మూడు సినిమాలతోనే వాళ్ళ రేంజ్ ని దాటేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం. ‘హనుమాన్’ తో ఇప్పటికే పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసే రేంజ్ హిట్ ని అందుకొని, 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన తేజ సజ్జ, మిరాయ్ చిత్రానికి కూడా అదే రేంజ్ గ్రాస్ వసూళ్లను రాబడుతాడని ఇప్పటి నుండే అంచనాలు వేసుకుంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
Also Read: కిష్కింధపురి vs మిరాయి: ఏ సినిమా హిట్? ఏది ఫ్లాప్?
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ముందుగా ప్రభాస్ వాయిస్ ఓవర్ తో మొదలు అవుతుంది. ఆడియన్స్ కి ఇది థియేటర్స్ లో సర్ప్రైజ్ ఫ్యాక్టర్ గా నిల్చింది. ప్రభాస్(Rebel Star Prabhas) వాయిస్ ఈ చిత్రం లో ఉంటుందని నిన్న రాత్రి తేజ సజ్జ ఒక ట్వీట్ వేసే వరకు ఎవరికీ తెలియదు. అలాంటిది ఒక్కసారిగా థియేటర్ లో ఆయన వాయిస్ ఓవర్ వినగానే అభిమానులు మెంటలెక్కిపోయారు. కేవలం ప్రభాస్ వాయిస్ ఓవర్ ఉందనే విషయం తెలుసుకొని సినిమాకు వెళ్లిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అంటే అతిశయోక్తి కాదేమో. అది ప్రభాస్ రేంజ్. అయితే సినిమాలో మీరు విన్నది నిజమైన ప్రభాస్ వాయిస్ కాదట. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా క్రియేట్ చేయబడిన వాయిస్ అట అది. ఈమధ్య కాలం లో ఎక్కువ గా డబ్బింగ్ కి కూడా AI వాయిస్ ని ఉపయోగిస్తున్నారు.
అయితే ఈ విషయం తెలుసుకున్న తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త నిరుత్సహానికి గురయ్యారు. కేవలం ప్రభాస్ పేరు చెప్పుకొని కాస్త ఓపెనింగ్స్ పెంచుకోవడం కోసం ఫ్యాన్స్ అయినటువంటి మమ్మల్ని ఇంత మోసం చేస్తారా అంటూ ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా లో ‘మిరాయ్’ టీం పై మండిపడుతున్నారు. కానీ కొంతమంది మాత్రం ఎలాగో కల్కి తర్వాత ప్రభాస్ నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. కనీసం ఆయన వాయిస్ ని ఎదో ఒక రూపం లో థియేటర్స్ లో ఇలా వినే అదృష్టం కలిగింది, దీంతో సంతృప్తి పడుదాం అని తమకు తాము సర్దిచెప్పుకుంటున్నారు. ఇకపోతే ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ కి ప్రభాస్ ముఖ్య అతిథిగా వస్తాడని ఒక రూమర్ ఉంది. చూడాలి మరి ఇది ఎంత వరకు నిజం అవుతుంది అనేది.