Ekadasi significance: ప్రతి ఏడాదిలో ధనుర్మాసం లో శ్రీమహావిష్ణువుకు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. ఈ మాసంలో వచ్చే ఏకాదశి కి ప్రత్యేకత ఉంటుంది. ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు. 2025 డిసెంబర్ 30వ తేదీన వచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని అంటున్నారు. శ్రీ మహావిష్ణువు ఈరోజు పూజించడం వల్ల మూడు కోట్ల దేవతలను పూజించినట్లు అవుతుందని.. అందుకే ఈ రోజును ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. అయితే ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలని చాలామంది అంటుంటారు. ఈరోజు కనీసం అన్నం కూడా తినవద్దని అంటున్నారు. అసలు అన్నం ఎందుకు తినవద్దని చెబుతున్నారంటే?
పురాణాల ప్రకారం ఏకాదశి రోజున అన్నంలో పాపపురుషుడు నివసిస్తాడని నమ్ముతారు. అందుకే అన్నం తినడం వల్ల పుణ్యం తగ్గిపోయి వ్రత ఫలం దక్కదని అంటుంటారు. అంతేకాకుండా విష్ణువును ప్రత్యేకంగా ఆరాధించేవారు అన్నం ముట్ట వద్దని అంటుంటారు. అయితే మరికొందరు చెబుతున్న ప్రకారం ఏకాదశి రోజున మనసు, శరీరం అదుపులో ఉండాలంటే సాత్విక భోజనం చేయాలని అంటుంటారు. సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తీసుకోవాలని చెబుతుంటారు. ఇలా చేయడం వల్ల దైవం పై మనసు వెళ్లే అవకాశం ఉంటుంది. మరి ఏకాదశి రోజున ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఏకాదశి రోజున సులభంగా జీవనమయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఈరోజు సహజ సిద్ధంగా లభించే పండ్లు, పాలు, పెరుగు, కొబ్బరి నీళ్లు, ఉడకపెట్టిన బంగాళదుంప, శనగపిండి వంటలు, పప్పుకు సంబంధించిన ఆహార పదార్థాలను తీసుకోవచ్చు. ఇవి త్వరగా జీర్ణం అయ్యి భక్తి, ఆధ్యాత్మిక వైపు మనసును మళ్లించేస్తుంది. అలాగే శరీరానికి తగినంత విశ్రాంతి లభించి ప్రత్యేకంగా జపం చేయడానికి సహకరిస్తుంది. అంతేకాకుండా ఈరోజు శుద్ధి చేసిన ఆహారం తినడం వల్ల ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతారని చెబుతుంటారు. అలాగే వారం రోజులపాటు ఆహారం తిన్నవారు.. ఒకరోజు ఉపవాసం తో తక్కువగా లేదా సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకొని ప్రయత్నం చేయాలని అంటున్నారు.
అయితే ఏకాదశి రోజున ఆహార పదార్థాలను తీసుకోవడమే కాకుండా ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉండాలి. ఈరోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్థానమాచరించాలి. విష్ణు లేదా వెంకటేశ్వర స్వామి చిత్రంతో పూజలు నిర్వహించి విష్ణు సహస్రనామం, గోవింద నామస్మరణ, భగవద్గీత 12వ అధ్యాయం వంటివి పటిస్తూ ఉండాలి. ఈరోజు వ్రతం పూర్తి అయిన తర్వాత మరుసటి రోజు ఉదయం స్నానం చేసి. m విష్ణు పూజ చేసిన తర్వాత మాత్రమే ఉపవాసం విరమించాలి. ఇలా చేయడం వల్ల ఆయురారోగ్యాలు ఉండడంతో పాటు ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్ముతారు.