Vinayaka chavithi: కోరిన కోరికలు వెంటనే తీరాలంటే.. బొజ్జ గణపయ్యకు చేసి పెట్టాల్సిన ఇష్టమైన నైవేద్యాలు ఇవే!

గణపతికి ఇష్టమైన నైవేద్యాల్లో ఉండ్రాళ్ళు ఒకటి. ఈ ఉండ్రాళ్ళు పెట్టకుండా అసలు గణపతికి పూజ కూడా చేయరు. వినాయక పూజకి ఉండ్రాళ్ళు తప్పకుండా ఉండాలి. వీటిని బియ్యం పిండి, బెల్లంతో చేస్తారు. తినడానికి చాలా రుచిగా ఉంటాయి. వినాయకునికి బొబ్బట్లు కూడా చాలా ఇష్టమైనవి. శనగపప్పు, బెల్లం, గోధుమ పిండితో ఈ వంటకాన్ని చేస్తారు. రవ్వ, కొబ్బరితో చేసే మోదకాలు అంటే వినాయకునికి చాలా ప్రీతి. ఇవి లేకపోతే వినాయకుని పూజించినట్లు అనిపించదు.

Written By: Kusuma Aggunna, Updated On : September 6, 2024 11:44 am

Vinayaka Naivedhya

Follow us on

Vinayaka chavithi: ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకునే పండుగ వినాయక చవితి రానే వచ్చింది. అన్ని పండుగల కంటే ముందుగా గణపతిని పూజించన తర్వాత అన్ని పూజలు నిర్వహిస్తారు. గణపతిని భక్తి శ్రద్దలతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. వినాయక చవితి రోజూ ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించాలి. అయితే ఒక్కో దేవుడికి ఒక్కోటి అంటే ప్రీతి ఎక్కువ. శివుడుకి అభిషేకం అంటే ఎంత ఇష్టమో.. వినాయకునికి నైవేద్యం అంటే అంత ఇష్టం. వినాయక చవితి రోజు గణపతిని భక్తితో పూజించి.. దేవుడికి ఇష్టమైన నైవేద్యాలు పెట్టాలి. ఇలా గణపతికి ఇష్టమైనవి పెట్టడం వల్ల కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. దేశ వ్యాప్తంగా వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటారు. ఈ క్రమంలో గణేశునికి ఇష్టమైన నైవేద్యాలు చేసి పెడతారు. అయితే వినాయకునికి ఇష్టమైన నైవేద్యాలను 3,5,7,9 రకాలుగా పెడతారు. మరి గణేశునికి ఇష్టమైన ఆ వంటకాలు ఏంటో తెలుసుకుందాం.

గణపతికి ఇష్టమైన నైవేద్యాల్లో ఉండ్రాళ్ళు ఒకటి. ఈ ఉండ్రాళ్ళు పెట్టకుండా అసలు గణపతికి పూజ కూడా చేయరు. వినాయక పూజకి ఉండ్రాళ్ళు తప్పకుండా ఉండాలి. వీటిని బియ్యం పిండి, బెల్లంతో చేస్తారు. తినడానికి చాలా రుచిగా ఉంటాయి. వినాయకునికి బొబ్బట్లు కూడా చాలా ఇష్టమైనవి. శనగపప్పు, బెల్లం, గోధుమ పిండితో ఈ వంటకాన్ని చేస్తారు. రవ్వ, కొబ్బరితో చేసే మోదకాలు అంటే వినాయకునికి చాలా ప్రీతి. ఇవి లేకపోతే వినాయకుని పూజించినట్లు అనిపించదు. మోదకాలను చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు. కొందరు నువ్వులతో కూడా తయారు చేస్తారు. వినాయక చవితి అంటే తప్పకుండా అందరికి ఫస్ట్ గుర్తు వచ్చేది లడ్డులు. లడ్డు లేకుండా గణపతి విగ్రహాన్ని కూడా పెట్టరు. గణపతికి లడ్డులు అంటే చాలా ఇష్టం. అయితే ఈ లడ్డులో చాలా రకాలు ఉన్నాయి. రవ్వ లడ్డు, బేసిన్ లడ్డు ఇలా ఉన్నాయి. ఎవరికి నచ్చిన లడ్డులు వాళ్లు చేస్తారు. అలాగే జిల్లేడు కాయలు, కుడుములు, పాయసం, పాల తాళికలు, గారెలు, పులిహోర, శనగలు వంటివి కూడా చేసి పెడతారు. అయితే వీటిని కేవలం వినాయక చవితి రోజు మాత్రమే కాకుండా ప్రతి బుధవారం కూడా చేసి పెట్టవచ్చు. గణపతికి ఇష్టమైన వంటకాలు అన్ని చేసి ఇలా పెట్టడం వల్ల వినాయకుని అనుగ్రహం కలుగుతుంది. కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. అయితే వినాయకుని బేసి సంఖ్యలో మాత్రమే నైవేద్యాలు పెట్టాలి. కేవలం వినాయక చవితి రోజే అన్ని పెట్టడం కాకుండా.. నిమజ్జనం అయ్యే వరకు కూడా రోజుకి ఒకటి పెట్టవచ్చు. అన్ని ఒకసారి చేయలేం అనుకునే వాళ్లు రోజుకి ఒక నైవేద్యం చేసి వినాయకున్ని భక్తిశ్రద్ధలతో పూజిస్తే.. కోరిన కోరికలు నెరవేరుతాయి.