Kalki 2: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి సినిమా ప్రేక్షకుల అంచనాల మేరకు సక్సెస్ ని సాధించడమే కాకుండా నాగ్ అశ్విన్ కు ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తీసుకొచ్చి పెట్టింది. ఇక ఇప్పుడు నాగ్ అశ్విన్ కల్కి 2 సినిమా కోసం భారీ కసరత్తులను చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే కల్కి సినిమా చూసిన చాలామంది అందులో అమితాబచ్చన్ క్యారెక్టర్ ఎక్కువగా ఉంది. ప్రభాస్ క్యారెక్టర్ పెద్దగా ఏమీ లేదు. ఆయనను ఒక కామెడీ పాత్ర లాగా చిత్రీకరించారు అంటూ కొన్ని విమర్శలైతే వచ్చాయి. ఇక క్లైమాక్స్ మినహాయిస్తే ఈ సినిమా మొత్తం లో ప్రభాస్ చేసింది పెద్దగా ఏమీ ఉండదు. మరి ఇలాంటి విమర్శలను అందుకున్న నాగ్ అశ్విన్ ఇప్పుడు ఈ సినిమా కోసం ప్రభాస్ క్యారెక్టరైజేశన్ లో భారీ మార్పులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఆయన క్యారెక్టర్ ని ఒక హీరోయిజం ఉండే పాత్రగా మలచబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక కమల్ హాసన్ తో ప్రభాస్ ఢీకొనే సీన్స్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నడట. ఇక మొత్తానికైతే ప్రభాస్ చరిష్మా భారీ రేంజ్ లో ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఈ సినిమాని 2026వ సంవత్సరంలో స్టార్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఒక సంవత్సర కాలంలోనే ఈ సినిమాని పూర్తి చేసి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.
ఇక మొత్తానికైతే నాగ్ అశ్విన్ సినిమా మీదనే తన ఆశ, శ్వాస పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక మధ్య మధ్యలో కొన్ని చిన్న సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నప్పటికీ నాగ్ అశ్విన్ ఎక్కువ ఫోకస్ మాత్రం ఈ సినిమా మీదనే పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక మొదటి పార్ట్ తో 1000 కోట్ల కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా రెండో పార్ట్ తో 2000 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక నాగ్ అశ్విన్ కూడా తన శక్తి సామర్థ్యాల మేరకు ఈ సినిమాని హై వోల్టేజ్ సినిమాగా నిలపడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రభాస్ లాంటి స్టార్ హీరో దొరికితే దర్శకుడు ఎలాంటి ప్రభంజనాన్ని చేయగలడో కల్కి సినిమా ద్వారా చేసి చూపించాడు. ఇక కల్కి 2 సినిమాలో ప్రభాస్ పాత్ర ప్రత్యేకంగా ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.
ఇక ఇదిలా ఉంటే కల్కి పాత్రలో ఎవరు నటించబోతున్నారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక దానికోసం ఒక స్టార్ హీరోను తీసుకువచ్చే ప్రయత్నంలో నాగ్ అశ్విన్ ఉన్నాడట. ఇక తను అనుకున్నట్టుగానే భారీ విజయాన్ని సాధించి 2000 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టినట్టయితే పాన్ ఇండియాలో రాజమౌళి తర్వాత మంచి గుర్తింపును సంపాదించుకున్న స్టార్ డైరెక్టర్ గా నాగ్ అశ్విన్ చరిత్రలో నిలుస్తాడు…