https://oktelugu.com/

Mokshagna Teja: షాకింగ్.. మొదటి సినిమాకి మోక్షజ్ఞ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? బాలయ్య కంటే రెండింతలు ఎక్కువ!

బాలయ్య బాబు తప్ప ఎవరూ సూట్ కారనే విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా కి మోక్షజ్ఞ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం కోసం మోక్షజ్ఞ 20 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడట.

Written By:
  • Vicky
  • , Updated On : September 6, 2024 / 11:45 AM IST

    Mokshagna Teja

    Follow us on

    Mokshagna Teja: కోట్లాది మంది నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని మోక్షజ్ఞ మొదటి సినిమా కోసం ఎదురు చూస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రతీ ఏడాది ఈ సినిమా కోసం ప్రారంభం కోసం నందమూరి అభిమానులు ఎదురు చూడడం, నిరాశ చెందడం సర్వసాధారణం అయిపోయింది. అయితే ఇన్నేళ్ల అభిమానుల ఎదురు చూపులకు ఎట్టకేలకు తెరపడింది. నేడు ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరగనుంది. ‘హనుమాన్’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని కూడా నిర్మాణం లో భాగస్వామి అవ్వనుంది. ఈ చిత్రంలో బాలయ్య బాబు కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో ఆయన శ్రీకృష్ణుడి పాత్రలో కనిపించనున్నాడు.

    ఆ పాత్రకి బాలయ్య బాబు తప్ప ఎవరూ సూట్ కారనే విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా కి మోక్షజ్ఞ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం కోసం మోక్షజ్ఞ 20 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడట. బాలయ్య తన ప్రతీ సినిమాకి పది నుండి 15 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ అందుకుంటాడు, అలాంటిది మోక్షజ్ఞ తన మొదటి సినిమాతోనే బాలయ్య కంటే డబుల్ రెమ్యూనరేషన్ అందుకోవడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అయ్యింది. మొదటి సినిమాతోనే స్టార్ హీరో రేంజ్ ని అందుకున్న మోక్షజ్ఞ రాబోయే రోజుల్లో ఏ రేంజ్ కి వెళ్ళబోతున్నాడో చూడాలి. కెరీర్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే మోక్షజ్ఞ అతి తక్కువ సమయంలోనే సూపర్ స్టార్ రేంజ్ కి ఎదిగే అవకాశం ఉంది. చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ రెండవ చిత్రంతోనే స్టార్ హీరోగా మారిపోయాడు. ఆయన తర్వాత నాగార్జున కుమారులు నాగ చైతన్య, అఖిల్ కూడా భారీ హైప్ తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు కానీ స్టార్స్ కాలేకపోయారు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రెండవ సినిమాతోనే స్టార్ హీరో లీగ్ లోకి అడుగుపెట్టిన ఏకైక హీరో రామ్ చరణ్ మాత్రమే.

    ఇప్పుడు ఆయన తర్వాత మోక్షజ్ఞ కి కూడా ఆ అవకాశం ఉంది. ఇది ఇలా ఉండగా ప్రశాంత్ వర్మ సూపర్ హీరో సిరీస్ ని కొనసాగిస్తాడని, దానికి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అనే పేరు కూడా పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు మోక్షజ్ఞ చేయబోతున్న సినిమా కూడా ఆ యూనివర్స్ కి చెందినదే అని అంటున్నారు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసి, వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్ . త్వరలోనే దీనికి సంబంధించిన మరికొన్ని అప్డేట్స్ అతి త్వరలోనే బయటకి రానున్నాయి. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటించే అవకాశాలు ఉన్నాయి.