Horoscope Today:జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉండనుంది. అలాగే కొన్ని రాశులపై శుక్రుడి ప్రభావం ఉండడంతో మిథునం తో సహా మరికొన్ని రాశుల వారికి ఈర్థిక ప్రయోజనాలు ఉండనున్నాయి. వ్యాపారులకు కొత్త లాభాలు వస్తాయి. మేషం నుంచి మీనం వరకు రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
ఈ రాశి వ్యాపారులు విహార యాత్రలకు వెళ్తారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం సమకూరుతుంది.వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. పెండింగ్ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
వృషభరాశి:
ఆర్థికంగా పుంజుకుంటారు. ఇంటికి ప్రత్యేక అతిథి వస్తారు. కొన్ని కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చులు పెట్టాలి. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.
మిథున రాశి:
పిల్లల నుంచి శుభవార్తలు వింటారు జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులకు అనుకోని ఆదాయం పెరుగుతుంది. దీంతో ఉల్లాసంగా ఉంటారు.
కర్కాటక రాశి:
ఉద్యోగులు తమ స్థానం మారుతారు. పెద్దల సలహాతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు.
సింహా రాశి:
కొన్ని పనుల కారణంగా బిజీగా ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగాలతో సంబంధం ఉన్న వారికి పదోన్నతి ఉంటుంది. దీంతో ప్రశాంతంగా ఉంటారు. సాయంత్రం శుభ కార్యాక్రమాల్లో పాల్గొంటారు.
కన్యరాశి:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొందరు శత్రువులు మిత్రులుగా మారుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొనడానికి ఇదే మంచి సమయం. తెలివితేటలతో పనులు పూర్తి చేసుకోవాలి. దీంతో ఎదుటివారి నుంచి విజయం సాధిస్తారు.
తుల రాశి:
కొన్ని విషయాల్లో నిరాశకు గురవుతారు. కటుుంబంలో ఏదైనా ఆటంకం కలిగితే బంధువుల సహాయంతో సమస్య పరిష్కారం అవుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చిక రాశి:
వ్యాపారులు కొత్త ఒప్పందాన్ని చేసుకుంటారు. కుటుంబంలో కొత్త సమస్యలు ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. విద్యార్థులు ఉన్నత విద్య కోసం ప్రణాళికలు వేస్తారు.
ధనస్సు రాశి:
వ్యాపారులకు కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. దీంతో ఉల్లాసంగా ఉంటారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. రోజూ వారీ ఖర్చుల్లో అదనంగా ఉంటాయి. విద్యార్థులు కొన్ని పనులు పూర్తి చేయడానికి కష్టపడుతారు.
మకర రాశి:
కొత్త ఆస్తిని కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తే సక్సెస్ అవుతారు. పిల్లల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. బంధువుల నుంచి ధన సాయం అందుతుంది.
కుంభ రాశి:
వ్యాపారులకు తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులకు అదనపు ఆదాయం సమకూరుతుంది. జీవిత భాగస్వామి కోసం కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.
మీనరాశి:
బిల్లుల చెల్లింపుల్లో గందరగోళం ఏర్పడుతుంది. వ్యాపారులకు కొత్తగా లాభాలు వచ్చే అవకాశం. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల నుంచి డబ్బు సాయం తీసుకుంటారు.