cars : భారత్ లో కార్ల వినియోగం పెరిగిపోతుంది. దీంతోమార్కెట్లోకి కొత్త కొత్త మోడళ్లు వస్తున్నాయి. అయితే నేటి తరానికి ఆకట్టుకునే విధంగా ఆధునిక ఫీచర్లు, అప్డేట్ ఇంజిన్లతో కూడిన వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం పెట్రోల్ లేదా డిజిల్ వెహికల్స్ అని కాకుండా హైబ్రిడ్ వాహనాలను ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే డిసెంబర్ నెలలో కొన్ని వాహనాలు లాంచ్ కానున్నాయి. మొన్నటి వరకు పండుగల సీజన్ నేపథ్యంలో చాలా కంపెనీలు కొత్త వాహనాలను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. ఇప్పుడు మరోసారి డిసెంబర్ లో హియర్ ఎండింగ్ సేల్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈనెలలో కొన్ని వాహనాలు మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ కార్ల గురించి తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వివరాల్లోకి వెళ్లండి..
హోండా కార్లకు ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. దీని నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన చాలా వెహికల్స్ వినియోగదారులను ఆకట్టుకున్నాయి. ఈ కంపెనీ నుంచి డిసెంబర్ 4న కొత్త వెహికల్ మార్కెట్లోకి రాబోతుంది. అదే హోండా అమేజ్ కొత్త వెర్షన్. దీని పాత వెర్షన్ కు మంచి గుర్తింపు వచ్చింది. ీ నేపథ్యంలో అప్డేట్ వెహికిల్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఈ వెహికల్ లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉండనుంది. 90 బీహెచ్ పీ పవర్, 110 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేసే ఈ మోడల్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. దీనిని రూ.7.19 లక్షల ప్రారంభ ధరతో విక్రయించనున్నారు. ఇంటీరియర్ డిజైన్ ఆకట్టుకునే విధంగా ఉండడంతో దీనిని కొనేందుకు వినియోగదారులు రెడీ అవుతున్నారు.
టయోటా కంపెనీపై వినియోగదారులకు మంచి ఆదరణ ఉంది. దీని నుంచి ఓ హైబ్రిడ్ వెహికల్ అందుబాటులోకి రాబోతుంది. అదే టయోటా క్రామ్రి. ఇందులో 2.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇన్నర్ లో 12.3 అంగుళాల టచ్ స్క్రీన్ తో పాటు ఏసీ వెంటిలేషన్, ప్రయాణికులకు అనుగుణంగా సీట్లు ఉండనున్నాయి. సేప్టీ కోసం ఇందులో ఎయిర్ బ్యాగ్స్ ను అమర్చారు. పెట్రోల్ తో పాటు డీజిల్ వెర్షన్ ను కూడా ఇందులో ఉండనుంది. దీనిని డిసెంబర్ 11న లాంచ్ చేయనున్నారు. దీనిని రూ.48 నుంచి రూ.49 లక్షల వరకు విక్రయించనున్నారు.
కియా కార్లు దేశంలో దూసుకుపోతున్నాయి. ఈ కంపెనీ ఎస్ యూవీ ప్రొడక్ట్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో డిసెంబర్ 19న కియా నుంచి సిరోస్ ఎస్ యూవీ విడుదల అవుతోంది. ఇందులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో పాటు డీజిల్ ఇంజిన్ కూడా ఉండనుంది. ఇప్పటి వరకు కియా కార్లకు అందులోనూ ఎస్ యూవీ కార్లకు ఉన్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని కంపెనీ కొత్త మోడల్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తుంది. దీనిని రూ. 8.50 లక్షల నుంచి రూ.9.50 లక్షల వరకు విక్రయించనున్నారు.