Belgium Woman : ప్రపంచంలోని ప్రతి దేశంలో పడక వృత్తిని చేపట్టే మహిళలు ఉన్నారు. ఈ మహిళల జీవితం సాధారణ మహిళల జీవితం కంటే చాలా కష్టంగా ఉంటుంది. వారి ముందు డబ్బు సంపాదించడమే లక్ష్యంగా ఉంటుంది. వారి జీవితం నరకయాతనగా ఉంటుంది. వారికి దేశంలో గౌరవం లభించదు. ప్రభుత్వ పథకాలలో వీరు భాగం కారు. ప్రపంచంలోని అనేక దేశాలలో ఇలాంటి మహిళలకు ఎటువంటి హక్కులు ఇవ్వలేదు. కానీ బెల్జియం 2022 సంవత్సరంలో లైంగిక పనిని నేరాల వర్గం నుండి తొలగించడమే కాకుండా చట్టబద్ధం చేసింది. దీని తర్వాత దేశం మళ్లీ మరో చారిత్రాత్మక అడుగు వేసింది. పడక వృత్తిని చేపట్టే వారికి ప్రసూతి సెలవులు, పెన్షన్ ఇస్తామని ప్రకటించింది.
చట్టం ముందు దేశంలో పరిస్థితి ఎలా ఉండేది ?
బెల్జియంకు చెందిన ఇదే వృత్తిని పాటిస్తున్న ఓ మహిళ మాట్లాడుతూ.. ఈ చట్టం తీసుకొచ్చే ముందు నేను 9 నెలల గర్భవతి అయిన తర్వాత కూడా డబ్బు సంపాదించడానికి లైంగిక పని చేయవలసి వచ్చింది. ప్రస్తుతం ఆమె ఐదుగురు పిల్లలకు తల్లి. ఐదవ బిడ్డను కనబోతున్నప్పుడు డాక్టర్ తనను బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారని అయితే అలా చేయడం తనకు సాధ్యం కాదని, ఎందుకంటే ఆమె పని చేయకపోతే తన పిల్లలకు తిండిపెట్టలేనని చెప్పుకొచ్చింది. డబ్బు అవసరం కాబట్టి తాను ఆ పనిని ఆపలేకపోయాయని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన ప్రసూతి సెలవులు, పింఛను వల్ల తన జీవితం మరింత సులభతరమైందని ఆమె చెప్పుకొచ్చారు.
ఎలాంటి హక్కులు ఇస్తున్నారు?
బెల్జియం చారిత్రాత్మక అడుగు, కొత్త చట్టం కారణంగా, పడక వృత్తిదారులకు ఇప్పుడు అనేక హక్కులను ప్రభుత్వం ప్రసాదించింది. దీని కింద వారు వర్క్ కాంట్రాక్ట్, ఆరోగ్య బీమా, పెన్షన్, ప్రసూతి సెలవులు, అనారోగ్య సెలవులకు అర్హులు. అలాగే, ఇది ఖచ్చితంగా ఏ ఇతర ఉద్యోగం లాగా పరిగణించబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఆ వృత్తి పాటించే వారు ఉన్నారు. అలాంటి వారు బెల్జియంలో మాత్రమే కాకుండా జర్మనీ, గ్రీస్, నెదర్లాండ్స్, టర్కీతో సహా అనేక దేశాలలో చట్టపరమైన గుర్తింపు ఇవ్వబడింది.. కానీ బెల్జియం మాత్రమే వారికి సెలవు, పెన్షన్ ఇచ్చే చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
చట్టం ఎలా మారింది?
2022లో పెద్ద ఉద్యమం తర్వాత పడక వృత్తిని చట్టబద్ధం చేయాలని బెల్జియం నిర్ణయం తీసుకుంది. దీనిపై నెలరోజులుగా దేశంలో నిరసనలు వెల్లువెత్తాయి. కోవిడ్ సమయంలో, దేశంలో వారికి మద్దతు లేకపోవడం గురించి గొంతెత్తారు. దీని ఫలితంగా పడక వృత్తిని చట్టబద్ధం చేయడానికి చారిత్రాత్మక నిర్ణయం తీసుకోబడింది. ఈ ఉద్యమంలో ముందంజలో ఉన్నవారిలో ఒకరు విక్టోరియా, బెల్జియన్ యూనియన్ ఆఫ్ సెక్స్ వర్కర్స్ (UTSOPI) అధ్యక్షుడిగా ఉన్నారు. గతంలో 12 సంవత్సరాలు ఎస్కార్ట్‌గా ఉన్నారు. ఇది వారికి వ్యక్తిగత పోరాటం. విక్టోరియా లైంగిక పనిని సామాజిక సేవగా భావిస్తుంది.
చట్టంపై విమర్శల వెల్లువ
హ్యూమన్ రైట్స్ వాచ్ పరిశోధకుడు ఎరిన్ కిల్‌బ్రైడ్ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడ చూసినా ఇదే అత్యుత్తమ అడుగు అని, ప్రతి దేశం ఈ దిశగా పయనించాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవైపు దేశంలో ఈ చట్టానికి మద్దతు లభిస్తోంది. మరోవైపు దీనిపై వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. వేలాది మంది మహిళలు కార్మిక హక్కులను కోరుకోవడం లేదని, అయితే వారు ఈ ఉద్యోగం నుండి బయటపడి సాధారణ జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నారని అన్నారు. లైంగిక పనిని సురక్షితంగా చేసే మార్గం ప్రపంచంలో లేదని కూడా ప్రముఖ సాంఘిక సంస్కర్త జూలియా క్రుమియర్ అంటున్నారు.