Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. డిసెంబర్ 2న శనివారం ద్వాదశ రాశులపై పుష్య నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉండనున్నాయి. 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
మేషరాశి:
ఈ రాశివారికి ఈరోజు ఖర్చులు అధికంగా ఉంటాయి. రుణాలు తిరిగి రావడానికి ఆలస్యమవుతాయి. సాయంత్ర ఆరోగ్యంలో మార్పులు ఉండే అవకాశం.
వృషభం:
కొన్ని పనులకు అడ్డంకులు రావొచ్చు. బంధువులతో వాగ్వాదాలు ఉంటాయి. వ్యాపారంలో ఆచితూచి డబ్బును పెట్టుబడి పెట్టాలి. ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి.
మిథునం:
ఉద్యోగులు కార్యాలయాల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. ఏదైనా పని ప్రారంభిస్తే విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని నిర్ణయాలు తొందరపడి తీసుకోవద్దు.
కర్కాటకం:
వ్యాపారులు పెట్టుబడి పెట్టడానికి అనుకూల సమయం. ఆధ్యాత్మిక రంగంలో ఎక్కువగా పాలు పంచుకుంటారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉండారు.
సింహం:
ఈ రాశివారికి అదనపు ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం. కాబట్టి జాగ్రత్తగా ఖర్చుపెట్టాలి. విహార యాత్రలకు ప్లాన్ వేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విలువైన వస్తువులు కొంటారు.
కన్య:
కొన్ని పనులు ఇష్టం లేకున్నా చేయాల్సి వస్తుంది. ఈ కారణంగా మనసు ఆందోళనగా ఉంటుంది. సాయత్రం బంధువులు, స్నేహితులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు.
తుల:
ఉద్యోగులకు అనుకూలమైన రోజు. మీ పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది.
వృశ్చికం:
ఖర్చులు పెరిగే అవకాశం. అనవసర వాదనలకు దూరంగా ఉండాలి. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో ఇతరుల సలహా తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో వాదనలకు దిగొద్దు.
ధనస్సు:
ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. సామాజిక కార్యక్రమాలపై ఎక్కువగా దృష్టి పెడుతారు. ఎవరితోనైనా ఎక్కువగా వాదించే ముందు ఆలోచించాలి.
మకరం:
ఉల్లాసవంతమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి. సాయంత్ర శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. దీంతో ఉల్లాసంగా ఉంటారు.
కుంభం:
కొత్త ప్రణాళికలు వేస్తారు. పెండింగులో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో సహకారం ఉంటుంది. ఇప్పటి వరకు చేస్తున్న పనుల్లో విజయం సాధిస్తారు.
మీనం:
వ్యాపారులు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని విషయాల్లో పెద్దల సలహా పాటించడం మంచిది. కుటుంబ జీవితం ఉల్లాసంగా ఉంటుంది. సాయంత్రం శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు.