Rashi Phalalu: రాజకీయ నాయకులపై ఈ రాశి ప్రభావం.. ఈరోజు 12 రాశులు ఎలా ఉన్నాయంటే?

ఈ రాశివారిపై నేడు ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు.

Written By: Chai Muchhata, Updated On : November 30, 2023 8:10 am

Rashi Phalalu

Follow us on

Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవంబర్ 30న గురువారం ద్వాదశ రాశులపై అర్ర్ధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో మిథునం రాశివారికి అనుకూల ఫలితాలు ఉండనున్నాయి. 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

మేషరాశి:
వీరు చేసే కొన్ని పనుల వల్ల లాభాలు కలుగుతాయి. ఇతరులతో మంచిగా ప్రవర్తించాలి. మధ్యాహ్నం అధికారులతో వాగ్వాదం ఉండే అవకాశం. సాయంత్రం ప్రణాళికలు పూర్తయితే సంతోషంగా ఉంటారు.

వృషభం:
ఉద్యోగులకు కార్యాలయాల్లో వివాదాలు ఉండొచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. చట్టపరమైన అనుభవం పొందుతారు.

మిథునం:
ఈ రాశివారిపై నేడు ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు.

కర్కాటకం:
వ్యాపారం చేసేవారికి భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. ఇతరులతో అనవసరంగా వాదనలకు దిగొద్దు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సింహం:
కొన్ని అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు ఉంటే అవకాశం. అనుభవం ఉన్న వారి సలహా తీసుకోండి.

కన్య:
ఉద్యోగులు సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. కొత్త శక్తిని పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. బెట్టింగులకు దూరంగా ఉండడం మంచిది.

తుల:
విహార యాత్రలకు ప్లాన్ వేస్తారు. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. వ్యాపారులు చేసే ప్రయత్నాల్లో మంచి విజయం సాధిస్తారు.

వృశ్చికం:
మానసికంగా ఆందోళనగా ఉంటారు. పేదల కోసం ఖర్చు చేస్తారు. కొత్త ప్రాజెక్టులపై ఫోకస్ చేస్తారు. సీనియర్ల నుంచి మద్దతు లభిస్తుంది.

ధనస్సు:
ఇతరలుతో అనవసర వాదనలకు దిగొద్దు. స్నేహితుల కారణంగా కొత్త పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారులకు మంచి రోజు.

మకరం:
ముఖ్యమైన పని కోసం ఆందోళన చెందుతారు. కొత్త ఆదాయ వనరుల పొందుతారు. మీ స్నేహితులతో ఒకరి నుంచి పెట్టుబడులు పొందుతారు.

కుంభం:
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామి నుంచి ఆశ్చర్యకరమైన బహుమతిని పొందవచ్చు. ప్రియమైన వారితో జాగ్రత్తగా ఉండాలి.

మీనం:
శత్రవులు ఆధిపత్యాన్ని చెలాయించడానికి ప్రయత్నిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. వాగ్వాదాలకు దిగకుండా ప్రశాంతంగా ఉండాలి.