https://oktelugu.com/

Shivani Rajashekar: ఉప్పెన సినిమాలో శివాని రాజశేఖర్ చేసి ఉంటే ఆ సినిమా పరిస్థితి ఎలా ఉండేదంటే..?

వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి తనదైన మార్క్ నటనతో ప్రేక్షకులందరిని కట్టిపడేసాడు.ఇక ఎవ్వరికీ సాధ్యం కానీ రీతిలో డెబ్యూ సినిమాతోనే 100 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టిన హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : November 30, 2023 / 08:10 AM IST

    Shivani Rajashekar

    Follow us on

    Shivani Rajashekar: కొన్ని సినిమాలు భారీ అంచనాలతో వచ్చి ఆ అంచనాలను అందుకోకుండా ప్లాప్ సినిమాలు గా మిగిలిపోతూ ఉంటాయి.ఇక మరికొన్ని సినిమాలు మాత్రం ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి సూపర్ డూపర్ హిట్లుగా నిలుస్తాయి. ఇక అలాంటి సినిమాల్లో ఉప్పెన సినిమా ఒకటి… సుకుమార్ దగ్గర చాలా సంవత్సరాల నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న బుచ్చిబాబు డైరెక్టర్ గా మారి చేసిన ఈ ఉప్పెన సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

    ఇక ఈ సినిమాలో మెగా మేనల్లుడు ఆయన వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి తనదైన మార్క్ నటనతో ప్రేక్షకులందరిని కట్టిపడేసాడు.ఇక ఎవ్వరికీ సాధ్యం కానీ రీతిలో డెబ్యూ సినిమాతోనే 100 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టిన హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు… ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఈ సినిమా విషయంలో హీరోయిన్ పాత్ర సినిమాకి చాలా కీలకంగా ఉంటుంది.అయితే హీరోయిన్ వల్లనే ఆ సినిమా అనేది చాలా మలుపులు తిరుగుతూ వస్తుంది.

    చివరికి హీరోయిన్ హీరో ని యాక్సెప్ట్ చేయడమే ఈ సినిమా క్లైమాక్స్ దాంట్లో ఏ మాత్రం తేడా జరిగిన సినిమా ప్లాప్ అయ్యేది కాబట్టి ఆ హీరోయిన్ పాత్ర కోసం చాలామంది అమ్మాయిలను చూసి వాళ్లలో ఎవరిని ఎంచుకోవాలి అనే విషయం లో జాగ్రత్తలు తీసుకొని మరి కృతి శెట్టిని ఎంచుకున్నారు. అయితే ఈ పాత్ర కోసం ముందుగా శివాని రాజశేఖర్ ని అడిగినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి.అయితే ఈ పాత్రలో ఆమె కనక చేసినట్లయితే ఈ సినిమా హిట్ అయ్యేది కాదు అని చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ కి ముందే పాటలు ద్వారా కొంతవరకు హైప్ ని క్రియేట్ చేసుకుంది.

    ఇక హీరోయిన్ కృతి శెట్టి ని చూసిన ప్రతి అభిమాని కూడా ఆ అమ్మాయి అందాన్ని గాని, అభినయాన్ని గాని చూసి ఫిదా అయిపోయారు ఇక దాంతో సినిమా సక్సెస్ కి కృతి శెట్టి చాలా వరకు హెల్ప్ అయిందనే చెప్పాలి.ఇక శివాని రాజశేఖర్ ఈ సినిమాకి అంత ప్లస్ అయి ఉండేది కాదు ఎందుకంటే కృతి శెట్టి చూడగానే ప్రేక్షకులను అందం తో ఆకర్షించింది అదే కృతి లో ఉన్న ప్లస్ పాయింట్ కాబట్టే ఈ సినిమా మీద జనాల్లో బజ్ అనేది క్రియేట్ అయింది…