Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవంబర్ 18న శనివారం కార్తీక మాసం మొదటి శనివారం సందర్భంగా ద్వాదశ రాశులపై ఉత్తరాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉండనున్నాయి. 12 రాశుల వివరాలు ఎలా ఉన్నాయంటే?
మేషరాశి:
ప్రత్యర్థుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఇష్టమైన పనిని త్వరగా పూర్తి చేయండి. తప్పకుండా విజయం సాధిస్తారు. పెట్టుబడి పెట్టేవారు కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం మంచిది.
వృషభం:
కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఓ సమాచారం సంతోషాన్ని ఇస్తుంది. ఇతరులతో వాగ్వాదం దిగొద్దు. ఖర్చులు పెరుగుతాయి.
మిథునం:
ఉద్యోగులు కార్యాయలాల్లో అధికారుల మద్దతు పొందుతారు. వ్యాపారులు పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయం. ఈ సమయంలో ఇతరుల సలహా తీసుకోవడం మంచిది.
కర్కాటకం:
తొందరపాటుతో ఎటువంటి నిర్ణయం తీసుకోవదదు. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. వ్యాపార ప్రణాళికలు వేస్తారు. కొన్ని రంగాల వారికి శుభ ఫలితాలు ఉంటాయి.
సింహం:
వ్యాపారులకు ప్రతికూల ఫలితాలు. అనుకున్న సమయానికి డబ్బు అందకపోవచ్చు. వివాహానికి ప్రతిపాదనలు చేసేవారికి సంబంధాలు వస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
కన్య:
ఆర్థిక లావాదేవీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇష్టం లేకపోయినా కొన్ని ఖర్చులు భరించాల్సి వస్తుంది. జీవిత భాగస్వామితో ప్రతి పని గురించి చర్చించాలి.
తుల:
వ్యాపారులు ఇతరులతో ఆందోళనకు దిగవద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. జీవిత భాగస్వామితో ప్రేమగా వ్యవహరించాలి. ఆదాయ వనరులు పొందుతారు.
వృశ్చికం:
ఆర్థికంగా ఎదగడం చూసి ఇతరులు అసూయ పడుతారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి.పెండింగు పనులు పూర్తి చేయడంలో ముందుకు సాగుతారు.
ధనస్సు:
సమస్యలను పరిష్కరించడంలో శ్రద్ధ చూపుతారు. కొత్త వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. బంధువులతో ఉల్లాసంగా ఉంటారు. కొన్ని రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు.
మకరం:
ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. రోజూవారి కంటే ఎక్కువ ఖర్చులు అయ్యే అవకాశం. వ్యాపారంలో ఆశించిన లాభాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
కుంభం:
న్యాయపరమైన సమస్యలు తొలిగేందుకు దారులు పడుతాయి. అనారోగ్యంతో ఉంటే ఈరోజు పరిష్కారం అవుతుంది. ఆస్తులు కొనాలని ఆలోచించేవారు ఇతరుల సలహా తప్పకుండా తీసుకోవాలి.
మీనం:
వ్యాపారులు దూర ప్రయాణాలు చేయొచ్చు. స్నేహితులు, బంధువులతో కలిసి ఉల్లాసంగా కనిపిస్తారు. ఏ పని చేసినా అందులో తప్పకుండా విజయం సాధిస్తారు.