Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సంచలన నిర్ణయం… ఇంటి నుండి ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ అవుట్!

ఈ వారం ఎక్కువ మంది నామినేషన్స్ లో ఉండటంతో భారీ స్థాయిలో ఓటింగ్ నమోదైనట్లు తెలుస్తుంది. కాగా అత్యధిక ఓటింగ్ తో యావర్ టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్నాడు. ప్రశాంత్ ఇంకా శివాజీ నామినేషన్స్ లో లేకపోవడంతో వాళ్ళ ఫ్యాన్స్ కూడా యావర్ కి ఓట్లు వేస్తున్నారు.

Written By: NARESH, Updated On : November 17, 2023 6:47 pm

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. కాగా పదో వారం భోలే షావలి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే పదకొండవ వారం నామినేషన్ ప్రక్రియ రంజుగా సాగింది. మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేషన్ లిస్ట్ లో చేరారు. అంబటి అర్జున్, ప్రియాంక జైన్, శోభా శెట్టి, అమర్ దీప్, ప్రిన్స్ యావర్, అశ్విని శ్రీ, రతిక రోజ్, గౌతమ్ కృష్ణ నామినేషన్ లిస్ట్ లో ఉన్నారు. కెప్టెన్ అయిన కారణంగా శివాజీ నామినేషన్స్ నుంచి తప్పుకున్నాడు. ఇక ప్రశాంత్ కి ఒక్క ఓటు మాత్రమే పడడంతో సేఫ్ అయ్యాడు.

ఈ వారం ఎక్కువ మంది నామినేషన్స్ లో ఉండటంతో భారీ స్థాయిలో ఓటింగ్ నమోదైనట్లు తెలుస్తుంది. కాగా అత్యధిక ఓటింగ్ తో యావర్ టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్నాడు. ప్రశాంత్ ఇంకా శివాజీ నామినేషన్స్ లో లేకపోవడంతో వాళ్ళ ఫ్యాన్స్ కూడా యావర్ కి ఓట్లు వేస్తున్నారు. ఇక అమర్ దీప్ రెండో స్థానంలో ఉన్నాడు. మిగిలిన స్థానాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. తర్వాతి స్థానాల్లో అర్జున్, గౌతమ్, ప్రియాంక, శోభా ఉన్నట్లు తెలుస్తుంది.

అయితే బిగ్ బాస్ ముద్దు బిడ్డ రతిక రోజ్ డేంజర్ జోన్ లో పడిపోయింది. అతి తక్కువ ఓటింగ్ నమోదు చేసుకుని రతిక రోజ్, అశ్విని శ్రీ చివరి రెండు స్థానాల్లో ఉన్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే సగానికి పైనే ఆట పూర్తి అయింది. ఇక మిగిలింది కేవలం ఐదు వారాలు మాత్రమే కావడంతో .. ఈ వారం డబల్ ఎలిమినేషన్ జరిగే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే గనుక జరిగితే రతిక ఇంకా అశ్విని ఇద్దరు ఎలిమినేట్ అవ్వడం ఖాయం.

కానీ .. రతిక బిగ్ బాస్ కి ముద్దు బిడ్డ కాబట్టి ఆమెను కాపాడటానికి ఏమైనా చేయగలడు. అందుకే నాలుగో వారంలోనే ఎలిమినేట్ అయిన రతికను రీ ఎంట్రీ పేరుతో మళ్ళీ హౌస్ లోకి పంపించాడు. పైగా కావాల్సినంత కంటెంట్ ఇస్తుంది కాబట్టి ఏదోకటి చేసి బిగ్ బాస్ ఆమెను కాపాడుకుంటాడు. అయితే యావర్ కనుక ఎవిక్షన్ పాస్ రతికకి వాడితే ఆమె సేఫ్ అయిపోతుంది. అసలు ఏం జరగనుందో చూడాలి మరి.