Ram Charan: పాన్ ఇండియా లెవెల్ లో మంచి మార్కెట్ ఉన్న హీరోలలో ఒకరు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan). ఆయనతో కలిసి నటించడానికి ఏ హీరోయిన్ అయినా ఒక అదృష్టం లాగా భావిస్తుంటారు. అలాంటిది ఒక యంగ్ హీరోయిన్ రామ్ చరణ్ తో కలిసి నటించేందుకు ససేమీరా నో చెప్పిందట. ఆమె పేరు స్వసిక(Swasika). ఈమె మలయాళం లో పాపులర్ నటి. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చి బాబు(Buchi Babu Sana) తో చేస్తున్న పెద్ది చిత్రం లో రామ్ చరణ్ కి తల్లి పాత్రలో నటించాల్సిందిగా బుచ్చి బాబు కోరాడట. స్వసిక వయస్సు కేవలం 33 సంవత్సరాలు మాత్రమే. రామ్ చరణ్ వయస్సు 40 ఏళ్ళు. అయినా 33 ఏళ్ళ అమ్మాయిని అసలు రామ్ చరణ్ కి తల్లి పాత్రలో నటించమని అడగడం ఏంటి?, బుచ్చి బాబు కి బుర్ర పోయిందా అని మీరు అనుకోవచ్చు.
Also Read: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు..నార్త్ అమెరికా లో ఫైర్ స్ట్రోమ్!
కానీ ఆమె సినిమాలో రామ్ చరణ్ కి ప్రస్తుత కాలంలో ఉన్న తల్లి పాత్ర కాదు, ఆయన చిన్నతనం లోని తల్లి క్యారక్టర్ అన్నమాట. సాధారణంగా ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ఏ నటి కూడా వదులుకోదు. ఎందుకంటే రామ్ చరణ్ సినిమాలో నటిస్తే పాన్ ఇండియా వైడ్ గా రీచ్ వచ్చినట్టే. అయినప్పటికీ వదులుకోవడానికి కారణం, రామ్ చరణ్ కి తల్లి పాత్ర అనే కారణం చేతనే అట. వేరే ఏ క్యరెక్టర్ అయినా చేస్తాను కానీ, రామ్ చరణ్ కి తల్లి, అక్క, చెల్లి పాత్రల్లో నటించనని తెగేసి చెప్పిందట. అంటే ఈమె ఏకంగా ఆయన పక్కన హీరోయిన్ క్యారక్టర్ లో కనిపించాలని అనుకుంటుంది అన్నమాట. అబ్బో, అమ్మడికి కోరికలు చాలా ఎక్కువే అంటూ సోషల్ మీడియా లో రామ్ చరణ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా మార్చి 27 న విడుదల కాబోతుంది.
ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన గ్లింప్స్ వీడియో కి ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూశాము. ‘గేమ్ చేంజర్’ తో చావు దెబ్బ తిన్న అభిమానులు, ఈ సినిమా తో పాన్ ఇండియా లెవెల్ లో రికార్డ్స్ బద్దలు కొడుతామనే నమ్మకాన్ని ఇచ్చింది ఈ గ్లింప్స్ వీడియో. ఈ చిత్రానికి AR రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. తన కెరీర్ లోనే ది బెస్ట్ అనిపించే రేంజ్ సాంగ్స్ ఈ చిత్రం కోసం కంపోజ్ చేసాడట AR రెహమాన్. ఇక ఈ చిత్రం లో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ రామ్ చరణ్ కి గురువు క్యారక్టర్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. ఈమెకు సంబంధించిన లుక్ ని కూడా ఇది వరకే మనమంతా చూశాము.