Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు తమ స్థానాలను ఆరు నెలలకు ఒకసారి మార్చుకుంటాయి. ఈ మార్పులో భాగంగా గ్రహాలు కొన్ని రాశుల్లో ప్రయాణం చేయడం వల్ల మిగతా రాశులపై ప్రభావం పడుతూ ఉంటాయి. ప్రస్తుతం పుష్యమాసం నడుస్తోంది. ఆ తర్వాత ఫిబ్రవరిలో మాఘమాసం రాబోతుంది. ఈ సమయంలో గ్రహాలు చాలావరకు మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఫిబ్రవరి నెలలో బుధుడు, శని గ్రహాలు కలవబోతున్నాయి. ఇప్పటికే శని కుంభరాశిలో ప్రయాణిస్తున్నాడు. ఈ రాశిలోకి ఫిబ్రవరి 11 నుంచి బుధుడు రాబోతున్నాడు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశులపై ప్రభావం పడనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకోవాలని ఉందా..? అయితే ఈ వివరాల్లోకి వెళ్లాలి..
బుధ, శని గ్రహాల కలయిక వల్ల మేషరాశిపై ప్రభావం పడనుంది. ఈ రెండు గ్రహాల ప్రభావంతో మేష రాశి వారి ఆదాయం అనూహ్యంగా పెరుగుతుంది. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి అవకాశాలు దక్కుతాయి. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి పదోన్నతి వచ్చే అవకాశాలు ఎక్కువ. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలు చేస్తారు.
రెండు గ్రహాల కలయిక వల్ల మిథున రాశిలోనూ మార్పులు జరగనున్నాయి. ఈ రాశి వారు ఏ పని చేపట్టిన వెంటనే పూర్తి చేస్తారు. వ్యాపారులు అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. ప్రతిభ ఆధారంగా పదోన్నతులు లభిస్తాయి. సీనియర్ల మద్దతుతో కొత్త ప్రాజెక్టు చేపడతారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి సంతోషాన్ని కలిగిస్తాయి. అనుకోకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ధనస్సు రాశిపై బుధ, శని గ్రహాల కలయిక ప్రభావం ఉండనుంది. ఈ రాశి వారు పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తను వింటారు. వ్యాపార అభివృద్ధి కోసం ప్రయాణాలు చేయాల్సివస్తే అవి లాభిస్తాయి. వీరు ఏ పని చేపట్టిన పూర్తి చేయడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు కొత్త ఆదాయాన్ని పొందుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. పిల్లల కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్త అందుతుంది. అయితే ఈ రాశి వారు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. వారితో ఆర్థిక వ్యవహారాలు జరపకుండా ఉండాలి.
కుంభ రాశి వారి జీవితాలు కూడా బుధ, శని గ్రహాల కలయికతో మారనున్నాయి. వీరికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. బంధువుల నుంచి ధన సహాయ అందుతుంది. కొత్తగా ప్రాజెక్టులు చేపడితే వాటికి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. భాగస్వాముల నుంచి సపోర్ట్ ఉండటం వల్ల ఎక్కువ ప్రాజెక్టులు చేపడతారు. ఉద్యోగులు అనుకున్న దానికంటే ఎక్కువగా జీతం పొందుతారు. దూర ప్రయాణాలు చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళుతూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. కుటుంబ సభ్యులకు కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తారు. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి.