Subsidy Loan: మనలో చాలామంది తమ స్వశక్తి తో పైకి ఎదగాలని భావిస్తారు. అలాంటి వాళ్ళ కోసం ప్రభుత్వం ఒక శుభవార్తను తెలిపింది. ప్రభుత్వం అలాంటి వారికి 50 శాతం సబ్సిడీతో రుణాలను అందించనుంది. బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి. శ్రీదేవి మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో బీసీల ఆర్థిక అభివృద్ధికి రూ.38.41 కోట్లతో ప్రణాళికను రూపొందించామని తెలిపారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.19.20 కోట్లు సబ్సిడీని అందిస్తుండగా, మిగిలిన 19.20 కోట్లు బ్యాంకులు రుణాల కింద సమకూరుస్తున్నారని వెల్లడించారు. బి. శ్రీదేవి లోకల్ మాట్లాడిన క్రమంలో ఈ ప్రణాళిక కారణంగా చిత్తూరు జిల్లాలోని 2020 మంది బీసీలు లబ్ధి పొందుతారని చెప్పుకొచ్చారు. ఈ ప్రభుత్వ పథకాలను మూడు స్లాబుల్లో విభజించారు. ఇందులో మొదటి స్లాబ్ లో యూనిట్ ధర రూ.2 లక్షలు గా నిర్ణయించడం జరిగింది. ఇక ఇందులో రూ.75 వేలు సబ్సిడీ ఉంటుందని, అలాగే రూ.1.25 లక్షలు బ్యాంకులు రుణంగా ఇస్తారని వివరించారు. రెండవ స్లాబ్ లో యూనిట్ ధర రూ.3 లక్షలు గా నిర్ణయించడం జరిగింది. ఇక రూ.1.25 లక్షలు సబ్సిడీ అలాగే రూ.1.75 లక్షలు బ్యాంకులు రుణంగా ఇస్తారని చెప్పుకొచ్చారు. ఇక మూడవ స్లాబ్ లో యూనిట్ ధర రూ.5 లక్షలు గా నిర్ణయించడం జరిగింది. ఇందులో రూ. రెండు లక్షలు సబ్సిడీ అలాగే రూ. 300000 బ్యాంకు రుణంగా ఇస్తారని వివరించారు. ఈ క్రమంలోనే బ్రాహ్మణ కార్పొరేషన్ కింద జిల్లాకు 16 యూనిట్లు రూ.33 లక్షలతో మంజూరు చేయాలని వెల్లడించారు. ఇక కమ్మ కార్పొరేషన్ కు 73 మంది లబ్ధిదారులకు రూ.1.46 కోట్లతో, అలాగే ఈ బీసీ కార్పొరేషన్ కింద 89 యూనిట్లకు రూ.1.75 కోట్లు ప్రణాళికను రూపొందించామని తెలిపారు. రెడ్డి కార్పొరేషన్ కింద 65 మందికి రూ.1.30 కోట్లు, క్షత్రియ కార్పొరేషన్ కింద 11 మంది లబ్ధిదారులకు రు.23 లక్షలతో అలాగే వైశ్య కార్పొరేషన్ కింద 13 మంది లబ్ధిదారులకు రూ.28.5 కోట్లతో ప్రణాళికలు రూపొందించామన్నారు.
జిల్లాలోని బ్యాంకులు వీటికి ఆమోదం తెలిపిందన్నారు. ఇక వ్యవసాయ రంగానికి సంబంధించి వెనుకబడిన వారికి రోటవేటర్, ఆయిల్ ఇంజిన్లు,స్పెర్లు, పవర్ టిల్లర్, పుట్టగొడుగుల తయారీ, మినీ ట్రాక్టర్, ఎడ్లబండ్లు, ట్రాక్టర్ కంప్రెసర్ తదితర యూనిట్లు మంజూరు చేసామని తెలిపారు. అలాగే పశుసంవర్ధక శాఖకు సంబంధించి రెండు ఆవులను అందజేస్తామని దాంతోపాటు రైతులు కోళ్ల షెడ్డును కూడా నిర్మించుకోవచ్చు అని తెలిపారు.ఇక రవాణా రంగానికి సంబంధించి మినీ వ్యాన్, ఈ ఆటో తదితరాలను అందజేస్తామని తెలిపారు. ఫ్లోర్ మిల్లు కూడా పెట్టుకోవచ్చు అని తెలిపారు.
పరిశ్రమల రంగానికి సంబంధించి మ్యాంగో జల్లి తయారీ తదితరులు ఉంటాయని చెప్పుకొచ్చారు. అలాగే సర్వీస్ రంగంలో ద్విచక్ర వాహనాల రిపేరు, ఆటో సర్వీసింగ్, వాచ్ రిపేర్లు, ఎంబ్రాయిడరీ వర్క్, బ్యూటీ పార్లర్, బార్బర్ షాప్, క్యాటరింగ్ యూనిట్లు, మెకానిక్ షాపులు, డ్రై ఫ్రూట్స్ సెల్లింగ్ షాపులు, మైక్ సిస్టం, ప్లంబర్, సెల్ఫోన్ రిపేర్లు, బ్యాటరీ సర్వీసింగ్ షాపు తదితరులు కూడా ఉంటాయని వెల్లడించారు. ఇక ఈ పథకానికి వయస్సు 21 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. బీసీలకు 21 జనరిక్ షాపులు మంజూరు చేస్తామని తెలిపారు.