Parenting: తల్లిదండ్రులు పిల్లలను చిన్నప్పటి నుంచి చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. వారికి ఎలాంటి కష్టం రాకుండా అన్ని సౌకర్యాలు అందాలని చూసుకుంటారు. అందుకే పిల్లలు ఏ వస్తువు అడిగిన కూడా కాదనకుండా ఇస్తారు. అయితే కొందరు తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వన్ని ఇవ్వాలనే భావనలో వారి బాధ్యతలను మాత్రం తీసుకోరు. వారికి కావాల్సిన డబ్బు, వస్తువులు అన్ని ఇస్తారు. కానీ ప్రేమ, సమయం ఇలాంటివి మాత్రం ఇవ్వరు. వారికి కావాల్సిన అన్ని ఇస్తున్నామని తల్లి దండ్రులు అనుకుంటారు. కానీ పిల్లలకు సంతృప్తికరంగా ఉండవు. అయితే ఈ రోజుల్లో చాలా మంది వారి వ్యక్తిగత పనుల్లో బిజీ అయిపోయి పిల్లలను అసలు పట్టించుకోవడం లేదు. డబ్బు సంపాదించడం కోసం పిల్లలను చూసుకోవడానికి ఆయాలను పెడుతున్నారు. కానీ పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే సమయమే పెద్ద సంపాదన అనే విషయం మాత్రం తెలుసుకోరు. ప్రస్తుత జనరేషన్‌లో అయితే అసలు ఉద్యోగాల ధ్యాసలో పడి కొందరు పిల్లలను తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు. అసలు వీరి బాధ్యతను తీసుకోకుండా ఇతరులకు అప్పగిస్తున్నారు. ఇంతకీ పిల్లల బాధ్యత ఎవరు తీసుకోవాలి? తల్లి లేకపోతే తండ్రి? అనే విషయం తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.
పిల్లల బాధ్యతలను తల్లిదండ్రులు ఇద్దరూ చూసుకోవాలి. అందులోనూ అమ్మాయి అయితే తల్లి, అబ్బాయి అయితే తండ్రి కాస్త ఎక్కువ బాధ్యత తీసుకోవడం మంచిది. సాధారణంగా కూతురికి నాన్నతో, కొడుకు తల్లితో ఎక్కువ క్లోజ్‌నెస్ ఉంటుంది. కానీ తల్లి మాత్రం కూతురి బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఎంత క్లోజ్ అయిన కూడా అన్ని విషయాలను తండ్రితో పంచుకోలేరు. కొన్ని విషయాలను మాత్రమే తండ్రికి చెప్పగలరు. మిగతా విషయాలు అన్ని కూడా తల్లితోనే షేర్ చేసుకుంటారు. కూతురికి తల్లికి ఏదో విధంగా ఒక బంధం ఉంటుంది. పైకి ఇద్దరు ప్రేమగా లేకపోయిన మనస్సులో కనిపించని చాలా ప్రేమ ఉంటుంది. అలాగే తండ్రి కొడుకు బాధ్యతను తీసుకోవాలి. తల్లి కొడుకులను గారాబంగా పెంచుతుంది. వారు జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలంటే మాత్రం తండ్రిది ముఖ్యపాత్ర ఉండాలి. కుటుంబ బాధ్యతలు, వారు ఎలా ఉండాలి, ఇతరులను గౌరవించడం అన్ని కూడా తండ్రి నేర్పించాలి. దీన్నే బట్టే వారు కుటుంబ బాధ్యతలను తీసుకుంటారు. అదే తండ్రి గాలికి వదిలేస్తే వారి జీవితం ఇంకా అంతే సంగతులు.
తల్లి మాత్రం కూతురి బాధ్యతలను తీసుకోవాలి. ముఖ్యంగా ఇంట్లో ఎలా ఉండాలి, ఇతరులతో ఎలా మాట్లాడాలి, ఇంటికి ఎవరైనా వస్తే ఎలా గౌరవం ఇవ్వాలి, వంట, ఇంట్లో పనులు వంటివన్నీ తల్లి నేర్పించాలి. ఎందుకంటే పెళ్లయిన తర్వాత అత్తారింటికి వెళ్తే ఇలాంటి సమస్యలు చాలా వస్తాయి. వీటివల్ల తల్లిదండ్రులకు మాట రాకుండా ఉండాలంటే తల్లి చిన్నప్పటి నుంచి అన్ని విషయాలు కూతుళ్లకు చెప్పాలి. ముఖ్యంగా ఇద్దరూ బాధ్యత తీసుకోవాలి. తల్లిదండ్రులు కలిసి బాధ్యతగా పిల్లలకు చిన్నప్పటి నుంచే అన్ని విషయాలు నేర్పించాలి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.