https://oktelugu.com/

Sutti Baba : సుత్తి వేలు పరిచితం, సుత్తి వీరభద్రరావు సుపరిచితం.. కానీ “సుత్తి బాబా” మీకు తెలుసా?: వైరల్ వీడియో

ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో ఇప్పటికే లక్షల్లో వ్యూస్ నమోదు చేసుకుంది. "సుత్తి వేలును చూశాను. సుత్తి వీరభద్రరావును చూశాను. కానీ ఈ సుత్తి బాబా ఎవరు?" అంటూ Harish R. Menon రాసుకొచ్ఛాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. " ఈ ఆడవాళ్లకు ఏమైంది. అలా సుత్తితో కొట్టించుకుంటున్నారేంటి?

Written By:
  • NARESH
  • , Updated On : July 9, 2024 / 10:01 PM IST

    sutti baba

    Follow us on

    Sutti Baba : “మన దేశంలో శాస్త్రవేత్తలకు పెద్దగా ఫ్యాన్స్ ఉండరు. మాయ మంత్రాలు చేస్తామని చెప్పే వాళ్లకు భక్తులు ఉంటారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో అద్భుతాలను విశ్వసించరు. గాల్లో నుంచి విబూది తీస్తే నమ్ముతారు”. అప్పట్లో ఓ తెలుగు సినిమాలో బాగా పాపులర్ అయిన డైలాడ్ ఇదీ. నిజ జీవితంలో జరుగుతున్న సంఘటనలను దృష్టిలో పెట్టుకొనే ఆ సినిమాలో ఈ డైలాగ్ రాశానని ఆ రచయిత ఓ ప్రెస్ మీట్ లో చెప్పాడు. అయితే ఆ సినిమా విడుదలై దశాబ్దం గడుస్తున్నా నాటికి నేటికి పరిస్థితి ఏమాత్రం మారలేదు. పైగా ప్రస్తుత స్మార్ట్ కాలంలో మరింత పెరిగింది.. సోషల్ మీడియా వాడకం విస్తృతమైన తర్వాత అలాంటి సంఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఆ తరహా వీడియోలు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వ్యాప్తిలో ఉన్న ఓ వీడియో ప్రకారం..

    ట్విట్టర్ ఎక్స్ లో Harish R. Menon అనే ఐడీలో ఓ వీడియో పోస్ట్ అయింది. ఆ వీడియో ప్రకారం ఓ వ్యక్తి బాబా అవతారం ఎత్తాడు. అతని వయసు 45 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉంటుంది. చేతిలో ఒక సుత్తి ఉంది. ఆ సుత్తి తో అతడు మహిళలను కొడుతున్నాడు. అతడు కొడుతుంటే ఆ మహిళలు కూడా తన్మయత్వంతో ఊగి పోతున్నారు. పైగా ఆ సుత్తితో అతడు ఆడవాళ్ళ పి*** భాగంలో కొడుతుండడం విశేషం. అలా అతడు కొడుతున్నప్పటికీ ఆ మహిళలు ఏమాత్రం అడ్డు చెప్పడం లేదు. పైగా అతడిని దైవాంశ సంభూతుడిగా పేర్కొంటున్నారు. పైగా అతని పేరుతో జపాలు, పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. ఆడవాళ్లు బాగా వస్తుండడంతో అతనికి గిరాకీ బాగానే ఉన్నట్టుంది. అందుకే భారీగా టెంట్లు వేసి మరీ వచ్చిన ఆడవాళ్ళ కోసం సౌకర్యాలు ఏర్పాటు చేశాడు.

    ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో ఇప్పటికే లక్షల్లో వ్యూస్ నమోదు చేసుకుంది. “సుత్తి వేలును చూశాను. సుత్తి వీరభద్రరావును చూశాను. కానీ ఈ సుత్తి బాబా ఎవరు?” అంటూ Harish R. Menon రాసుకొచ్ఛాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. ” ఈ ఆడవాళ్లకు ఏమైంది. అలా సుత్తితో కొట్టించుకుంటున్నారేంటి? ముందు మీ సమస్య ఏమైనా ఉంటే ఆసుపత్రి లేదా మరోచోట చూపించుకొండి. నయమైపోతుంది. అంతే తప్ప ఇలాంటి వ్యక్తులను నమ్మకండి” అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.