https://oktelugu.com/

Somavati Amavasya 2024: సోమావతి అమావాస్యతో.. ఈ రాశుల వారికి అంతా మంచే!

హిందూ శాస్త్రంలో సోమావతి అమావాస్యకి ఓ ప్రత్యేకత ఉంది. ఎంతో పవిత్రమైన సోమావతి అమావాస్య పూజను అందరూ కూడా జరుపుకుంటున్నారు. శివుని ఆరాధిస్తూ.. పూజిస్తే ఇంట్లో ఉన్న అశాంతి, దారిద్య్ర బాధలు అన్ని పోతాయని పండితులు అంటున్నారు. ఈ అమావాస్య చాలా అరుదైనదని, ఈ రోజు పూజిస్తే ఇంట్లో అంతా మంచే జరుగుతుందని పండితులు చెబుతున్నారు. అయితే ఈ రోజు నుంచి కొన్ని రాశుల వారికి అంతా మంచే జరుగుతుందని పండితులు అంటున్నారు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 30, 2024 / 03:53 PM IST

    Somavathi Amavasya

    Follow us on

    Somavati Amavasya 2024: హిందూ శాస్త్రంలో సోమావతి అమావాస్యకి ఓ ప్రత్యేకత ఉంది. ఎంతో పవిత్రమైన సోమావతి అమావాస్య పూజను అందరూ కూడా జరుపుకుంటున్నారు. శివుని ఆరాధిస్తూ.. పూజిస్తే ఇంట్లో ఉన్న అశాంతి, దారిద్య్ర బాధలు అన్ని పోతాయని పండితులు అంటున్నారు. ఈ అమావాస్య చాలా అరుదైనదని, ఈ రోజు పూజిస్తే ఇంట్లో అంతా మంచే జరుగుతుందని పండితులు చెబుతున్నారు. అయితే ఈ రోజు నుంచి కొన్ని రాశుల వారికి అంతా మంచే జరుగుతుందని పండితులు అంటున్నారు. మరి ఏయే రాశి వారికి ఈ సోమావతి అమావాస్య నుంచి ఎలా ఉండబోతుందో చూద్దాం.

    మేషం
    ఈ సోమావతి అమావాస్య నుంచి అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటారు. ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న వారికి మంచి సమయం ఇది. ఆరోగ్య పరంగా ఉన్న సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి. వైవాహిక జీవితంలో ప్రశాంత వాతావరణం ఉంటుందని పండితులు అంటున్నారు.

    మిథునం
    మిథున రాశి వారికి ఇది మంచి సమయం. అనుకున్న పనులు అన్ని కూడా జరుగుతాయి. బాధలు అన్ని తొలగిపోయి ఆనందం వస్తుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్య, వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయి. వ్యాపారంలో నష్టాలు ఉంటే ఇకపై లాభాలను చూస్తారు.

    కర్కాటక రాశి
    ఈ రాశి వారికి మంచి లాభాలు వస్తాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ రంగంలో వ్యాపారం చేస్తున్నవారికి అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి. కుటుంబంలో సఖ్యత ఏర్పడుతుంది.

    కన్యా రాశి
    ఇకపై కన్యా రాశి వారికి అన్ని మంచి రోజులే. ఎంతో కాలంగా ఉన్న సమస్యలు అన్ని కూడా తీరుతాయి. ఈ రాశి వస్త్ర వ్యాపారులకు లాభాలు వస్తాయి. ఇంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి. అలాగే ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి.

    మకరం
    ఈ రోజు నుంచి మకర రాశి వారికి అంతా మంచే జరుగుతుంది. ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటారు. ఉద్యోగస్థులకు ప్రమోషన్‌ వస్తుంది. అలాగే పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి. ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి అవుతాయి.

    కుంభ రాశి
    కుంభ రాశి వారు ఇకపై అన్ని కూడా శుభవార్తలే వింటారు. ఆర్థిక సమస్యలకు ఇకపై లోటు ఉండదు. వ్యాపారంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు అన్నింటా విజయం సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలన్నీ కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. సూచనలు, సలహాల కోసం పండితులను సంప్రదించగలరు.