YEAR ENDER 2024: ఈ ఏడాది కొందరి జీవితాల్లో బెస్ట్ ఇయర్ కావచ్చు. కానీ మరికొందరి జీవితాల్లో మాత్రం ఇదొక వరస్ట్ ఇయర్. ఎందుకంటే ఈ ఏడాది ప్రజలకు ఎంత మంచి జరిగిందో కొందరికి తీరని నష్టం జరిగింది. దేశంలో జరిగిన కొన్ని ప్రమాదాల వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోయారు. వారికి కావాల్సిన మనుషులను కోల్పోయారు. తమ బాధను వ్యక్త పరుచుకోవడానికి అసలు ఎవరూ లేకుండా పోయారు. కొన్ని ప్రమాదాలు మనుషుల నిర్లక్ష్యం వల్ల జరిగితే.. మరికొన్ని ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా జరిగాయి. అయితే ఈ ఏడాది ఎన్నో విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. అవేంటో మరి ఒకసారి తెలుసుకుందాం.
వరదలు
వాతావరణంలో మార్పుల వల్ల ప్రతీ ఏడాది దేశంలో వర్షాలు కురుస్తాయి. కానీ కొన్నిసార్లు ఈ వర్షాలు వరదలుగా మారుతాయి. ఈ ఏడాది ఇవి రావడంతో దేశంలోని చాలా ప్రాంతాల్లోని ప్రజలు చనిపోయారు. వర్షాలకు కొండ ప్రాంతాల్లో చరియలు విరిగిపడటంతో మరణించారు. ముఖ్యంగా ఉత్తర ఖండ్, సిక్కిం వంటి ప్రాంతాలను అయితే వరదలు ముంచెత్తాయి. దీంతో ఎందరో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనలు ఈ ఏడాది జరిగాయి.
వయనాడ్ విపత్తు
హాయిగా అందరూ రాత్రిపూట నిద్రపోతున్న సమయంలో ఒక్కసారిగా వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రకృతి విపత్తు వల్ల దాదాపుగా 254 మంది మరణించారు. ఎందరో వారి ఇళ్లు, కుటుంబాలను పోగొట్టుకుని చివరకు ఒంటరి అయ్యారు. భూతల స్వర్గం అయిన కేరళ ఒక్కసారిగా శవాలతో నిండిపోయింది. పచ్చని చెట్లుతో ఉండాల్సిన కొండ బురద, శవాలతో ఉన్న విషాదం దేశ వ్యాప్తంగా అందరినీ కలచివేసింది.
భోలేబాబా తొక్కిసలాట
ఉత్తరప్రదేశ్‌లో ఈ ఏడాది జులైలో భోలేబాబా పాద ధూళి కోసం ప్రజలు ప్రయత్నించారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి.. దాదాపుగా 121 మంది ఆ మట్టిలోనే కలిసిపోయారు. భోలేబాబా ఎక్కువగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇతని కోసం భారీ సంఖ్యలో జనాలు వెళ్తుంటారు. అయితే ప్రభుత్వం 80 వేల మందికి పర్మిషన్ ఇవ్వగా అంతకంటే భారీగా రావడం వల్ల తొక్కిసలాట జరిగి ప్రాణాలు కోల్పోయారు.
విజయవాడ వరదలు
ఏపీ రాజధాని విజయవాడలో ఈ ఏడాది వరదలు బీభత్సం సృష్టించాయి. వరద ధాటికి కృష్టా, బుడమేరు నదులు నిండిపోవడంతో ముంపు ప్రాంతాలను ముంచాయి. దీంతో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఇళ్లలోకి నీరు నిల్వ ఉండటం, వ్యవసాయం అంతా నష్టపోయారు. ఈ ఏడాదిలో మనస్సుకు బాధ కలిగించే ఘటనల్లో ఇది ఒకటి.
ఝాన్సీ ఆసుపత్రి అగ్ని ప్రమాదం
ఈ ఏడాది నవంబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం జరిగింది. ఐసీయూలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 18 మంది నవజాత శిశువులు పూర్తిగా దగ్ధమయ్యారు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. కానీ ఆ తర్వాత ఆసుపత్రి నిర్వాహకులు నిర్లక్ష్యం వల్ల ప్రమాదం మరింత పెరిగింది.