Social Media Influencer: వెనుకటి కాలంలో డబ్బులు సంపాదించాలంటే కొన్ని మార్గాలు మాత్రమే ఉండేవి. ఆ మార్గాలలో చాలామంది ప్రయాణించినప్పటికీ.. కొంతమందిని మాత్రమే ధనలక్ష్మి వరించేది.. అలా ధనలక్ష్మి వరించిన వారు మాత్రమే డబ్బు సంపాదించేవారు. డబ్బున్న వారిగా సమాజంలో గుర్తింపు పొందేవారు. మిగతావారు మా కర్మ ఇంతే అనుకొని నిట్టూర్చుకుంటూ జీవించేవారు. కానీ నేటి కాలంలో అలా కాదు.. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత.. సోషల్ మీడియా చుట్టు ప్రపంచం తిరుగుతున్న తర్వాత.. డబ్బు సంపాదన మార్గం పూర్తిగా మారిపోయింది.. డబ్బు అనేది వివిధ రూపాలలో రావడం మొదలుపెట్టింది.
నేటి కాలంలో సోషల్ మీడియాలో influencers కు విపరీతమైన డిమాండ్ ఉంది. సామాజిక మాధ్యమాలలో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న వారిని influencers అంటారు. నేటి కాలంలో వారికి విపరీతమైన డిమాండ్ ఉంది.. ఉదాహరణకు యూట్యూబ్ లో మిస్టర్ బీస్ట్ అనే వ్యక్తిని దాదాపు 41 కోట్ల మంది అనుసరిస్తున్నారు. అతడు కేవలం యూట్యూబ్లో వీడియోల ద్వారానే కొన్ని కోట్ల సంపాదించాడు. వాస్తవానికి యూట్యూబ్లోకి రాకముందు అతడు జీరో. ఎప్పుడైతే యూట్యూబ్లోకి వచ్చాడో ఒక్కసారిగా అతడి లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. మొదట్లో అంతగా పాపులారిటీ రాలేదు. ఆ తర్వాత క్రమక్రమంగా ఎదిగాడు. యూట్యూబ్ చరిత్రలోనే అత్యధిక ఫాలోవర్స్ కలిగి ఉన్న ఇండివిజువల్ యూట్యూబర్ గా చరిత్ర సృష్టించాడు.
Also Read: భారతదేశానికి India అనే పేరు ఇలా వచ్చింది…
మన దేశంలో కూడా చాలామంది యూట్యూబర్లు ఉన్నారు. సోషల్ మీడియా influencers ఉన్నారు. వారిలో అపూర్వముఖిజా ఒకరు. మొహమాట లేకుండా మాట్లాడటం.. ఏ విషయమైనా సరే కుండబద్దలు కొట్టేలా చెప్పడంలో ఈమె తర్వాతనే ఎవరైనా. అందువల్లే ఈమె సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. ఆమెకున్న పాపులారిటీని గుర్తించి ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ తన రియాల్టీ షో ట్రెయి టర్స్ లో ఆకాశం కల్పించాడు. దీంతో ఆమె పాపులారిటీ మరింత ఆమెను సోషల్ మీడియాలో అనుసరించే వారి సంఖ్య విపరీతమైంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనుకున్నట్టు.. తనకు పాపులారిటీ ఉన్న నేపథ్యంలో.. దానిని ఆదాయం వనరుగా మార్చుకోండి అపూర్వ. సోషల్ మీడియాలో కేవలం ఒక్క రీల్ చేస్తేనే 2.5 లక్షలు సంపాదించుకునే స్థాయికి ఆమె రేంజ్ ఎదిగింది. సోషల్ మీడియా ద్వారా రీల్స్ చేయడం.. ఇతర వాణిజ్య ప్రకటనలకు ప్రమోట్ చేయడం ద్వారా ఆమె తన ఆస్తులను ఏకంగా 41 కోట్లకు పెంచుకుంది.
నోయిడాలో పుట్టిన అపూర్వకు సోషల్ మీడియాలో మొదట్లో ఎకౌంట్లు కూడా ఉండేవి కావు. స్నేహితులు చెప్పిన మాటలు విని సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసింది. ఆ తర్వాత మొదట్లో కొన్ని రీల్స్ చేసింది. అవి అంతగా సక్సెస్ కాలేదు. అయినప్పటికీ ఆమె తన పంథాను మార్చుకోలేదు. పైగా కొన్ని విషయాలలో ఓపెన్ గానే మాట్లాడింది. అవి చూసే వాళ్లకు నచ్చాయి. అలా తన కంటెంట్ ను డెవలప్ చేసుకోవడం.. చాలా విషయాల్లో ఓపెన్ గా మాట్లాడటంతో ఆమె రెబల్ కిడ్ గా మారిపోయింది. ఏకంగా బాలీవుడ్ ఆమె తలుపు తట్టింది.. ఇప్పటికే ఆమె కొన్ని షో లలో కనిపించింది. భవిష్యత్తు కాలంలో ఆమె బాలీవుడ్ తెరపై కనిపించే అవకాశం కూడా ఉంది. సరిగ్గా మూడు పదుల వయసు కూడా లేని ఆమె ఇప్పటికే అనేక సంచలనాలు సృష్టించింది. సోషల్ మీడియాలో ఆమె కంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రమే కాదు.. ఫ్యాన్ గ్రూపులు కూడా ఉన్నాయి. ఆ గ్రూపులకు కూడా లక్షల్లో ఫాలోవర్స్ ఉండటం విశేషం.
Also Read: గ్లామర్ డోస్ పెంచేసిన విష్ణు.. సండే హాట్ గురూ..
ఇటీవల అపూర్వ విషయాన్ని ఓ ఐఐటీ గ్రాడ్యుయేట్ ప్రస్తావించారు. సోషల్ మీడియాలో చెత్తవాగుడువాగే వారంతా influencers అయిపోతున్నారు. ఐఐటీలో చదువుకున్నవారు మామూలుగా మిగిలిపోతున్నారు. కష్టపడి చదవడం కంటే సోషల్ మీడియాలో చెత్త చెత్త రీల్స్ చేసుకోవడం ఉత్తమం అని ఆమె వ్యాఖ్యానించారు. ఆమె మొదలు పెట్టిన ఈ చర్చ అనేక విషయాలకు మళ్లింది. చివరికి శేషం లేని ప్రశ్న గానే ఆ చర్చ మిగిలింది. ప్రతి రంగంలోనూ పోటీ ఉంటుంది. సోషల్ మీడియా ఇందుకు మినహాయింపు కాదు. కాకపోతే ఇందులో నూతనత్వానికి మాత్రమే గిరాకీ ఉంటుంది.. అపూర్వ అలా ఎప్పటికప్పుడు నూతనత్వాన్ని ప్రదర్శిస్తుంది కాబట్టి సోషల్ మీడియా స్టార్ అయిపోయింది. జస్ట్ 30 సంవత్సరాల వయసు కూడా లేకుండానే.. ఇటువంటి నేపథ్యం లేకుండానే 41 కోట్ల ఆస్తులను సంపాదించడం అంటే మామూలు విషయం కాదు కదా.