Silverware: మనకు అందుబాటులో ఉండే లోహాల వల్ల కొందరి జీవితాలు మారిపోతూ ఉంటాయి. వీటిలో బంగారం, వెండి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. బంగారం అందరూ కొనుగోలు చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే తులం బంగారమే నేటి రోజుల్లో లక్షల్లో ఉంది. అయితే బంగారం తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన లోహం వెండి. వెండి ద్వారా కూడా అనేక వస్తువులను తయారు చేసుకోవచ్చును. అంతేకాకుండా వెండి వస్తువులను ధరించడం వల్ల ఎన్నో రకాలుగా ప్రయోజనాలు ఉన్నాయి. శుక్రుడు, చంద్రుడు ఇష్టంగా ఉండే వెండిని ధరించడం వల్ల కొన్ని కష్టాల నుంచి దూరం అవుతాయి. అయితే వీటిని ధరించడమే కాకుండా ఇతరులకు కొన్ని వెండి వస్తువులను దానం చేయడం వల్ల ఎన్నో కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది. అయితే వెండి కి సంబంధించిన ఎలాంటి వస్తువులను దానం చేయాలి? అలా దానం చేస్తే ఏమవుతుంది?
Also Read: తెలుగు రాష్ట్రాలకు మరో ఉపద్రవం.. హైఅలెర్ట్
మార్కెట్లో బంగారం షాపుల వలె వెండి వస్తువుల విక్రయాల షాపులుగా అనేక రకాలుగా ఉన్నాయి. చాలామంది తమ ఇంట్లో వెండి వస్తువులను ఏర్పాటు చేసుకుంటారు. వెండి వస్తువులు ఇంట్లో ఉండడం వల్ల శాంతి నెలకు ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెంపొందుతాయి. బంగారంలాగే వెండి వస్తువులను కూడా ఇంట్లో ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. అంతేకాకుండా పూజ గదిలో కొన్ని రకాల వెండి వస్తువులు ఉండడం వల్ల ఎంతో మంచిదని అంటారు.
అయితే ఇంట్లో వెండి వస్తువులు ఉంచుకోవడమే కాకుండా కొన్ని రకాల వెండి వస్తువులను దానం చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. వీటిలో వెండి ఆవు ఒకటి. వెండి ఆకారం కలిగిన ఆవులు ఇతరులకు దానం చేయడం వల్ల ఇంట్లో సుఖ శాంతి లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెంపొంది. అప్పటివరకు ఉన్న కష్టాలు తొలగిపోతాయి.
వెండి వినాయకుడిని ఎవరికైనా దానం చేయడం వల్ల విజ్ఞాలు తొలగిపోతాయి. గతంలో చేసిన కొన్ని తప్పుల నుంచి వీరు శిక్షలను తప్పించుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వెండి వినాయకుడి విగ్రహాన్ని ఎవరికైనా దానం ఇవ్వడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది.
కొన్ని శుభకార్యాలలో చాలామంది వెండి నాణేలను బహుమతిగా ఇస్తూ ఉంటారు. ఇలా వెండి నాణేలు బహుమతులు ఇవ్వడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఎవరైతే వెండి వస్తువులు దానం ఇస్తారు వారి ఇంట్లో లక్ష్మీ కొలువై ఉంటుందని చెబుతారు. అంతేకాకుండా వెండి నాణేలను ఇంట్లో ఉంచి పూజలు చేయడం వల్ల కూడా శుభం కలుగుతుంది.
అక్షరాభ్యాసం సమయంలో కొందరు వెండి పెన్నులు దానం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల సరస్వతీ మాత అనుగ్రహం ఉంటుందని నమ్ముతారు. చదువుల దేవత అయిన సరస్వతి జ్ఞానం ను ప్రసాదించాలంటే వెండి తో కూడిన విద్యా వస్తువులను దానం చేయాలి.
జీవితంలో సానుకూల శక్తి ఉండే సమస్యలు తొలగిపోవాలని అనుకునేవారు పిండి వస్తువులను దానం చేయడం వల్ల సాధ్యపడుతుందని కొందరు చెబుతుంటారు. అందువల్ల ఎవరికైనా దానం ఇవ్వాలని అనుకుంటే వెండి వస్తువులను దానం ఇవ్వాలని అంటున్నారు.