Summer Kids Activities: వేసవికాలం రాగానే విద్యార్థుల్లో ఎక్కడా లేని సంతోషం ఉంటుంది. దాదాపు రెండు నెలలపాటు స్కూలు మూతపడతాయి. ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఇలాంటి సమయంలో ఆటల్లో మునిగిపోతారు చిన్నారులు. అయితే కొందరు బయటకు వెళ్లి ఆడుకోవడం ఇష్టం ఉండదు. అంతేకాకుండా ఎండ వేడిలో ఆడడం వల్ల అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. అందువల్ల పిల్లలు ఇంట్లో ఉండి బోర్ కొడుతుందని అంటూ ఉంటారు. అయితే ఇంట్లో వారికి బోర్ కొట్టకుండా కొన్ని చిన్న పనులను అప్పగించాలి. అంతేకాకుండా వారికి ఇష్టమైన రంగాల్లో శిక్షణ ఇప్పించాలి. అయితే వారు ఇంట్లో ఉన్న సమయంలో ఎలాంటి పనులు చేయించాలి?
Also Read: తెలుగు రాష్ట్రాలకు మరో ఉపద్రవం.. హైఅలెర్ట్
కొందరు చిన్న పిల్లలు చిన్నప్పటి నుంచే పని చేయడం ఆసక్తి చూపుతారు. ఇలాంటి వారికి ఇంట్లో వస్తువులను సర్దే పనిని అప్పగించాలి. తమ పుస్తకాలను సర్దుకోవడం.. లేదా దుస్తులను సక్రమంగా ఉంచుకోవడం వంటివి చేయించాలి. ఇలా చేయడం వల్ల వారిలో మానసికంగా దృఢంగా తయారవుతారు. అంతేకాకుండా ఇది అలవాటుగా మారి ఎప్పటికీ వారి దుస్తులను శుభ్రంగా ఉంచుకోగలుగుతారు.
చాలామంది పిల్లలకు వంట చేయడం అంటే చాలా ఇష్టం. ఇలాంటి సమయంలో వారికి కొత్త కొత్త వంటకాలను పరిచయం చేయించాలి. వారితోపాటు వంట చేయిస్తూ.. పనిని నేర్పించాలి. ఇలా నేర్పించడం ద్వారా వారు వంట పనిపై ఆసక్తి చూపుతారు. ఇది అలవాటుగా మారి భవిష్యత్తులో వారికి ఉపయోగపడుతుంది.
చాలామంది పిల్లలు ఖాళీ సమయం దొరకగానే మొబైల్ ఫోన్ పై పడుతూ ఉంటారు. అయితే ఇలాంటి వారికి మంచి కథల పుస్తకం కొనివ్వాలి. వారిని దానిని చదవమని చెప్పాలి. ఆసక్తికరమైన కథల పుస్తకం ఇవ్వడం ద్వారా వారిలో పఠన శక్తి పెరిగిపోతుంది. ఇది వారికి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది.
కొంతమంది పిల్లలకు సంగీతం వినడం అంటే చాలా ఇష్టం. మీరు టీవీలో వచ్చే బెస్ట్ మ్యూజిక్ను వింటూ ఉంటారు. అయితే వీరికి సంగీతం నేర్పించడం ద్వారా వారు దానిపై ఆసక్తి చూపుతారు. అంతేకాకుండా సంగీతం నేర్చుకోవడం వల్ల భవిష్యత్తులో వారికి ఉపయోగపడే అవకాశం ఉంది. సంగీతం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇది అలవాటుగా మారి వీరు సాధారణ సమయంలో కూడా సంగీతం వింటూ హాయిగా ఉంటారు.
కొందరి పిల్లలకు బొమ్మలు గీయడం అంటే చాలా ఇష్టం. వీరికి డ్రాయింగ్ నేర్పించడం వల్ల వారిలో మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అయితే ప్రత్యేకంగా శిక్షణకు పంపించలేని వారు ఇంట్లోనే సులువైన డ్రాయింగ్ మెలకువలు నేర్పించాలి. ఇలా నేర్పించడం వల్ల భవిష్యత్తులో వారు డ్రాయింగ్ ని ప్రధాన వృత్తిగా చేసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా చదువుతోపాటు డ్రాయింగ్ లో శిక్షణ తీసుకోవడం వల్ల భవిష్యత్తులో అనేక అవకాశాలు ఉంటాయి.
పిల్లల్లో మెదడు చురుగ్గా పనిచేయడానికి మైండ్ గేమ్స్ ఎక్కువగా ఆడనివ్వాలి. అంటే చెస్ లేదా క్యారం బోర్డు వంటి ఆటలను ఆడేలా ప్రోత్సహించాలి. వీటి ద్వారా మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అంతేకాకుండా పిల్లల్లో ఐక్యమత్యం పెరిగి సంతోషంగా ఉండగలుగుతారు.