Shani Jayanti 2025 : హిందూ సంప్రదాయంలో కొందరు ఎక్కువగా జాతకాలను నమ్ముతారు. ఒక మనిషికి మంచి జరగాలన్నా లేకపోయినా చెడు జరగాలన్నా కూడా శని ప్రభావం ఉంటుంది. జాతకంలో శని సరిగ్గా ఉంటే అదృష్టం కలసి వస్తుంది. అదే సరిగ్గా లేకపోతే చాలా బాధలు వస్తాయి. కొందరు తట్టుకోలేని బాధలను కూడా శని పెడుతుంది. అయితే ఈ శని సమస్యల నుంచి విముక్తి పొందాలంటే మీరు ఈరోజు కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాలి. దీనివల్ల జీవితంలో సుఖసంతోషాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. అయితే అన్ని బాధల నుంచి విముక్తి పొందాలంటే పాటించాల్సి పరిహారాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
వైశాఖ బహుళ అమావాస్య నాడు శని జయంతిగా నిర్వహించారు. మే 27వ తేదీ అనగా మంగళవారం ఈ రోజు వైశాఖ అమావాస్య శని జయంతిని జరుపుకుంటున్నారు. అయితే ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు పూజలు చేయాలి. ఇలా చేస్తే తప్పకుండా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఎవరి జాతకంలో అయినా శని బాధలు ఎక్కువగా ఉంటే తప్పకుండా ఈ శని జయంతి రోజు పూజలు నిర్వహించడం మంచిది. కొందరికి ఏలినాటి శని, అష్టమ శని ఉంటాయి. అలాంటి వారు కూడా శని జయంతి నాడు పూజలు నిర్వహించడం మంచిదని పండితులు చెబుతున్నారు. కొందరికి ఏ పని తలపెట్టినా కూడా ఆటంకం ఏర్పడుతుంది. ప్రతీ విషయంలో సమస్యలు వస్తాయి. అనుకున్న ఏ పని కూడా జరగదు. ఏదో రకంగా అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇలాంటి వారు ఈ రోజు తప్పకుండా పూజలు చేయాలి.
ఈ శని జయంతి నాడు శుభ్రంగా తలస్నానం చేసి ఉపవాసం చేయాలి. ఇంట్లో పూజా మందిరంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. అలాగే శివాలయానికి వెళ్లి పూజలు చేయాలి. శనీశ్వరునికి పూజారితో తైలాభిషేకం చేయించాలి. శని దేవునికి నల్లని వస్త్రాలు సమర్పించి నల్ల నువ్వులతో అష్టోత్తర శతనామ పూజ చేయించుకోవాలి. అలాగే మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. పూజ పూర్తి అయిన తర్వాత తమలపాకులో బెల్లం పెట్టి శని దేవునికి నైవేద్యంగా పెట్టాలి. ఆ తర్వాత నవ గ్రహాలకు తొమ్మిది లేదా పదకొండు ప్రదక్షిణలు చేయాలి. అలాగే బ్రాహ్మణులకు తాంబూలాలు కూడా ఇవ్వాలి. అయితే ఉదయం పూట ఉపవాసం ఉండి రాత్రిపూట ఆహారం తీసుకోవాలి. ఈ రోజున పేదలకు అన్నదానం, వస్త్ర దానం చేయడంతో పాటు కాకులకు, నల్ల చీమలకు ఆహారం అందించాలి. రోగులకు పండ్లు, పాలు, మందులు దానం జీవించి ఉన్నంత వరకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు దరిచేరవని పండితులు చెబుతున్నారు. ఈ రోజున ఉల్లిపాయ, మాంసం తినకూడదని నిపుణులు చెబుతున్నారు.