Punjab National Bank : మహిళలు మేటర్నిటీ ఖర్చులకోసం మాతృత్వ రుణ పథకం కింద పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.25 వేల నుంచి రూ.3 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. పంజాబ్ నేషనల్ బ్యాంకు దేశంలో ప్రభుత్వ రంగంలో ఉన్న రెండవ అతిపెద్ద బ్యాంక్. మహిళల కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒక అద్భుతమైన పథకాన్ని అమలు చేస్తుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ పనిచేసే మహిళల కోసం ప్రెగ్నెన్సీ మరియు మెటర్నిటీ సమయంలో అవసరమయ్యే ఖర్చులకోసం ఆర్థికంగా సహాయం అందించేందుకు ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం పేరు పీ ఎన్ బి మాతృత్వ పథకం. మహిళలకు డెలివరీ మరియు మెటర్నిటీ కేర్ ఖర్చులకోసం పీఎన్బీ బ్యాంకు ఈ రుణాన్ని అందిస్తుంది. వర్క్ చేసే ఉమెన్స్ రూ.25 వేలు నుంచి మూడు లక్షల వరకు ఈ పథకం కింద లోన్ పొందవచ్చు. వర్కింగ్ ఉమెన్స్ డెలివరీ కి రెండు నెలల ముందు సమయం నుంచి పిల్లలు పుట్టిన తర్వాత మూడు నెలల లోపు ఈ స్కీం కింద పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగి లేదా పబ్లిక్ సెక్టార్ కంపెనీ లేదా ప్రముఖ ప్రైవేట్ కంపెనీలలో పనిచేస్తున్న మహిళలు మాత్రమే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అందిస్తున్న మాతృత్వ స్కీం కి అర్హులు అవుతారు. అలాగే వర్కింగ్ ఉమెన్స్ పంజాబ్ నేషనల్ బ్యాంకులో శాలరీ ఖాతా కూడా కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకున్న మహిళలకు తనిఖీ చేసి అన్ని రకాల అర్హతలు ఉన్నాయా లేదా అని గుర్తించిన తర్వాత మాత్రమే వాళ్లకు లోన్ మంజూరు చేస్తారు. అర్హులైన మహిళలు పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారిక వెబ్సైట్లోకి వెళ్లిన తర్వాత పిఎన్బి మాతృత్వంలోని పేజీలోకి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత మీకు అర్హత ఉందా లేదా, లోన్ ఎంతవరకు వస్తుంది అనే పూర్తి వివరాలను ఒకసారి తనిఖీ చేసుకోండి.
ఈ లోన్ అప్లై చేయడానికి అవసరమైన అన్ని డాక్యుమెంట్లు గుర్తింపు కార్డు, ఆధార్ మరియు పాన్ కార్డు వంటివి రెడీగా పెట్టుకోండి. ఎంప్లాయిమెంట్ వెరిఫికేషన్ తో పాటు ప్రెగ్నెన్సీకి సంబంధించిన సెల్ఫ్ డిక్లరేషన్ వంటివి కూడా దగ్గర పెట్టుకోండి. అప్లికేషన్ ఫామ్ లో పూర్తి వివరాలను ఎంటర్ చేసిన తర్వాత అన్ని డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి. అప్లికేషన్లో అందించిన షరతులు పూర్తిగా తెలుసుకోండి. అప్లికేషన్ ఫారం వివరాలు పూర్తి చేయడానికి ముందు మీరు కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ కు ఫోన్ చేసి అన్ని వివరాలను పూర్తిగా తెలుసుకోవడం మంచిది. మీరు సబ్మిట్ చేసిన దరఖాస్తును పంజాబ్ నేషనల్ బ్యాంక్ తనిఖీ చేసిన తర్వాత మీకు లోన్ అందుతుంది.