Shani Dev
Shani Dev : శని పేరు చెప్పగానే కొందరు హడలిపోతారు. కానీ మనుషులు చేసే తప్పులను ఎత్తిచూపుతో వారిని సక్రమమైన దారిలో నడిపించేందుకు శని దేవుడు ఎంతో సహకరిస్తారు. దేవుళ్ళతోపాటు శని దేవుడికి కూడా పూజలు చేయడం వల్ల అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తారు. శని దేవుడి అనుగ్రహం పొందితే ఎలాంటి కష్టాలు ఉండకుండా ముందుకు వెళ్తారు. ఆ స్వామి ఆశీర్వాదం పొందేందుకు శనివారం తైలంతో అభిషేకం చేయాలి. అయితే ఒక్కోసారి ఇలాంటి పూజలు చేయకుండా కొన్ని రాశుల వారికి శని దేవుడి అనుగ్రహం ఉంటుంది. దీంతో ఆ రాశుల వారికి అదృష్టం కలిగి ఊహించని విధంగా డబ్బు సంపాదిస్తారు. మార్చి నెలలో అలా కొన్ని రాశుల వారికి అదృష్టం కలగనుంది. ఆ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
మార్చి నెలలో శని దేవుడు మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీంతో కొన్ని రాశులపై ఈ ప్రభావం ఉండనుంది. వాటిలో మేషరాశి ఒకటి. ఈ రాశి వారికి ఈ నెలలో ఆకస్మిక ధన లాభం ఉండనుంది. మీరు ఎలాంటి పెట్టుబడులు పెట్టిన దానికి అత్యధిక లాభాలు ఉంటాయి. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా స్థిరపడతారు. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కుటుంబంతో ఉల్లాసంగా ఉంటారు. విదేశాల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. పిల్లల కెరీర్ గురించి కీలక నిర్ణయం తీసుకుంటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇదే మంచి సమయం.
Also Read : ఈ ఐదు రాశుల వారికి హెచ్చరిక… కొన్నాళ్లపాటు వాటికి దూరంగా ఉండాలి.. ఎందుకంటే?
శని దేవుడు మీనరాశిలో ప్రవేశించడంతో ధనస్సు రాశి వారికి అనుకూల వాతావరణం ఉండనుంది. వీరి ఉద్యోగులు అయితే వారి జీవితాలు అనేక మలుపులు తిరుగుతాయి. కెరీర్ పరంగా మీరు ఏ పని చేపట్టిన సక్సెస్ అవుతారు. అయితే పెట్టుబడులను సురక్షిత మార్గంలో ఉంచాలి. పెద్దల సలహా తీసుకున్న తర్వాతనే కొత్త వాటిలో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. అనుకోకుండా ప్రయాణాలు ఉంటాయి. ఈ ప్రయాణాలు వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటక రాశి వారు మార్చి నెలలో అదృష్టవంతులుగా మారుతారు. వీరి వ్యాపారాలు విస్తరించబడతాయి. ఉద్యోగులు పదోన్నతులు పొందేందుకు మార్గాలు ఏర్పడతాయి. పాత బకాయిలను తీరుస్తారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుంటారు. చట్టపరమైన చిక్కులు ఉంటే పరిష్కారం అవుతాయి. ద్వార ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల డబ్బులు పొదుపుగా చేయడం అలవాటు చేసుకోవాలి. ఎవరికైనా అప్పు ఇవాల్సి వస్తే కాస్త ఆలోచించాలి. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వీరితో అప్పుడే ఆర్థిక వ్యవహారాలు జరపకుండా ఉండాలి. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
శని దేవుడు మీనరాశిలో ప్రవేశించడం వల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలగనుంది. అయితే మిగతా రాశుల వారు వారిపై శనిదేవుడి ప్రతికూల ప్రభావం ఉండకుండా ఉండాలంటే ప్రతి శనివారం ఆ స్వామికి ప్రత్యేక పూజలు చేయాల్సి ఉంటుంది. దీంతో వారికి కూడా అనుకూల వాతావరణం ఉండే అవకాశం ఉంది.
Also Read : ఈ రాశి వారికి ఈరోజు మహా శివుడి ఆశీస్సులు.. ఆ పనులన్నీ పూర్తి చేస్తారు…