Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశులపై గురువారం జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు ధనుస్సు రాశిలో సంచారం చేయనున్నాడు.ఈ రోజు రవి యోగం కారణంగా.. కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఉండనున్నాయి. మరికొన్ని రాశుల వారు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ఈ సందర్భంగా మేషం నుండి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
ఈ రాశి వారు కొన్ని వార్తల వల్ల నిరాశ చెందుతారు. వ్యాపారుల పెట్టుబడులకు లాభాలు ఉంటాయి. జీవిత భాగస్వామి నుంచి మెప్పు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
వృషభ రాశి:
కొన్ని ప్రభుత్వ పథకాల నుంచి అధిక ప్రయోజనం పొందుతారు. విదేశాలకు విళ్లే వారు శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.
మిథున రాశి:
కుంటుంబంతో సరదాగా గడుపుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విహార యాత్రలకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది.
కర్కాటక రాశి:
ప్రియమకైన వ్యక్తులతో సంతోషంగా ఉంటారు. ఆస్తి కొనుగోలుకు అనుకూల సమయం. జీవనోపాధి విషయంలో పురోగతి ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. వ్యాపారులు కొన్ని సమస్యల నుంచి బయటపడుతారు.
సింహారాశి:
శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. కొన్ని పనుల కారణంగా ఉద్యోగులు బిజీగా ఉంటారు. సాయంత్రం స్నేహితులతో సరదాగా గడుపుతారు.
కన్య రాశి:
ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం. ఆధ్యాత్మిక ప్రదేశాలకు విహార యాత్రలకు వెళ్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. బంధువుల నుంచి గౌరవం లభిస్తుంది. అనారోగ్య కారణంగా ఇబ్బందులు పడుతారు.
తుల రాశి:
ఓ విదేవీ సంస్థలో కొత్త ఒప్పందం చేసుకుంటారు. ఉద్యోగులకు కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. జీవితంలో కొత్త ఉత్సాహం నెలకొంటుంది. ఈరోజు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు.
వృశ్చిక రాశి:
పిల్లల భవిష్యత్ పై శుభవార్త వింటారు. ఉద్యోగులు విధులపై దృష్టి పెట్టాలి. శత్రువుల ఆధిపత్యం ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది. తండ్రి సలహా మేరకు వ్యాపారులు కొత్త పెట్టుబుడులు పెడుతారు.
ధనస్సు రాశి:
బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. సాయంత్రం ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగుల పనితీరు మెరుగుపడుతుంది. కొత్త ఆదాయం వనరులు సమకూరుతాయి. అధికారులతో సత్సంబంధాలు ఉంటాయి. ఎవరైనా అప్పు తీసుకున్నట్లయితే వెంటనే తిరిగి ఇస్తారు.
మకర రాశి:
ఇంటికి అతిథుల రాకతో సందడిగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు సాగుతాయి. బంధువుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. పెండింగులో ఉన్న పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు అందుతాయి. వ్యాపారులు లాభాలు పొందుతారు.
కుంభరాశి:
జీవనోపాధికి సంబంధించి కొత్త మార్గాలు అందుతాయి. వివాహ ప్రతిపాదనలు ఉంటాయి. ప్రతికూల పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోకూడదు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి.
మీనరాశి:
జీవిత భాగస్వామితో వ్యాపారం చేసినట్లయితే లాభాలు ఉంటాయి. ప్రయాణానికి ప్లాన్ చేసుకుంటే కలిసి వస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులు కీలక నిర్ణయాలు తీసుకుంటారు.