https://oktelugu.com/

Hari Hara Veeramallu : ‘వినాలి..వీరమల్లు చెప్తే మాట వినాలి’..11 సెకండ్ల ప్రోమోతో సోషల్ మీడియాని ఊపేసిన పవర్ స్టార్!

వర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాలలో అత్యంత భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న వాటిలో ఒకటి 'హరి హర వీరమల్లు'. ఎప్పుడో కరోనా లాక్ డౌన్ కి ముందు మొదలైన ఈ చిత్రం ఎట్టకేలకు చివరి దశకు చేరుకుంది. కేవలం రోజుల షూటింగ్ మినహా, దాదాపుగా మొత్తం పూర్తి అయ్యినట్టే అని నిర్మాత ఏఏం రత్నం ప్రకటించాడు.

Written By:
  • Vicky
  • , Updated On : January 14, 2025 / 06:45 PM IST
    Follow us on

    Hari Hara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాలలో అత్యంత భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న వాటిలో ఒకటి ‘హరి హర వీరమల్లు’. ఎప్పుడో కరోనా లాక్ డౌన్ కి ముందు మొదలైన ఈ చిత్రం ఎట్టకేలకు చివరి దశకు చేరుకుంది. కేవలం రోజుల షూటింగ్ మినహా, దాదాపుగా మొత్తం పూర్తి అయ్యినట్టే అని నిర్మాత ఏఏం రత్నం ప్రకటించాడు. మార్చి 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ప్రమోషనల్ కంటెంట్ ని ఇప్పటి నుండే ఒక్కొక్కటిగా వదలడం ప్రారంభిస్తున్నారు మేకర్స్. ఈ నెల 17వ తారీఖున ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పాట ‘మాట వినాలి’ విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా నేడు ఈ పాట ప్రోమో ని విడుదల చేసారు. దానికి అభిమానుల నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఈ పాట ఇంత బాగుంటుందని వాళ్ళు కూడా ఊహించలేదు.

    వినాలి..వీరమల్లు చెప్తే మాట వినాలి.. అంటూ బేస్ వాయిస్ తో పవన్ కళ్యాణ్ పాడగా, ఆ పాటకు సంబంధించిన 11 సెకండ్ల ప్రోమో ని మాత్రమే వదిలారు. దానికి యూట్యూబ్ లో అప్పుడే 3 మిల్లియన్లకు పైగా వ్యూస్ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంత చిన్న ప్రోమో కి ఇంతటి రెస్పాన్స్ అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంత ఆకలి తో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రోమోతో సినిమా ఏ రేంజ్ క్వాలిటీ తో తెరకెక్కిందో చెప్పకనే చెప్పారు. పవన్ కళ్యాణ్ నుండి అభిమానులు కానీ, ప్రేక్షకులు కానీ ఇలాంటి స్టఫ్ నే కోరుకుంటూ ఉంటారు. డైరెక్టర్ దానిని ఫోకస్ చేస్తూ ఇలాంటి పాటని పాడించినప్పుడే సక్సెస్ అయ్యాడు. పూర్తి స్థాయి పాట విడుదల అయ్యాక సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

    పవన్ కళ్యాణ్ సాధారణమైన పాటలు ఎప్పుడు పాడడు. కేవలం జానపదం ఉట్టిపడే పాటలను మాత్రమే ఆయన పాడుతాడు. అవన్నీ ఒక రేంజ్ లో వైరల్ అయ్యాయి. ఖుషి, తమ్ముడు, జానీ, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి వంటి చిత్రాల్లో ఆయన ఇప్పటి వరకు పాటలు పాడాడు. వీటిలో జానీ, అజ్ఞాతవాసి తప్ప మిగిలిన సినిమాలన్నీ ఇండస్ట్రీ ని షేక్ చేసాయి. ‘అత్తారింటికి దారేది’ లోని ‘కాటమరాయుడా’ పాట సెన్సేషనల్ హిట్టై ఏళ్ళ తరబడి వినిపించింది. 17 వ తారీఖున రాబోతున్న పాట కూడా అదే స్థాయిలో సెన్సేషన్ సృష్టిస్తుందని బలమైన నమ్మకం తో ఉన్నారు అభిమానులు. ఈ సినిమా సాధారణమైనది కాదని, బాహుబలి, #RRR రేంజ్ గ్రాండియర్ అని నిర్మాత రత్నం బయ్యర్స్ కి చెప్తున్నాడు. త్వరలో విడుదల చేయబోయే మూడు నిమిషాల వీడియో ఫ్యాన్స్, ఆడియన్స్ ని సరికొత్త లోకానికి తీసుకెళ్తుందని, అప్పుడు మా చిత్రం ఎంత పెద్దదో మీ అందరికీ తెలుస్తుందని అన్నాడట. ఈ నెలాఖరున ఆ పాట విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.