Rituals: హిందూ మతంలో కొన్ని ఆచారాలు, పద్ధతులు ఉంటాయి. వీటిని తప్పకుండా పాటించడం వల్ల మంచి జరుగుతుందని, ఇంట్లో డబ్బులు నిలకడగా ఉంటాయని భావిస్తారు. పొరపాటున ఏవైనా తప్పులు చేస్తే మాత్రం వాటిని క్లియర్ చేసుకోవడానికి చాలా ప్రయత్నిస్తారు. అయితే హిందూ సంప్రదాయంలో ఒక్కో వారానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అన్ని వారాలను కూడా చాలా పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా శుక్రవారం అయితే చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ శుక్రవారం రోజు ఉదయాన్ని లేచి ఇంటిని శుభ్రం చేసి పూజలు నిర్వహించారు. చాలా భక్తితో దేవుడిని పూజించి నియమాలు పాటిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోయి జీవితాంతం సుఖంగా ఉంటారని భావిస్తారు. శుక్రవారం రోజు లక్ష్మీ దేవిని పూజించడం వల్ల ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఇంట్లో డబ్బు ఉంటుందని పండితులు చెబుతుంటారు. అయితే ఈ శుక్రవారం రోజు కొన్ని పనులు చేయకూడదని పండితులు అంటున్నారు. తెలిసో తెలియక చేసిన కొన్ని తప్పుల వల్ల ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని ఉంటుందని పండితులు చెబుతున్నారు. మరి శుక్రవారం రోజు చేయకూడని ఆ పనులేంటో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.
శుక్రవారం రోజు లక్ష్మీ దేవిని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ రోజును చాలా పవిత్రంగా భావిస్తారు. కొందరు అయితే పూజలు నిర్వహించి, ఉపవాసం ఆచరిస్తారు. అలాగే మాంసాహారం వంటి వాటికి కూడా దూరంగా ఉంటారు. ఇలా లక్ష్మీ దేవిని పూజించడం వల్ల ఇంట్లో డబ్బు ఎప్పుడూ ఉంటుందని నమ్ముతారు. అయితే శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటి లక్ష్మీదేవిని, మహిళలను, పిల్లలను అసలు అవమానించకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. స్త్రీలను గౌరవించని వారు లక్ష్మీ దేవిని పూజించిన కూడా వ్యర్థమే. అలాగే పక్క ఇంటి వారు పంచదార లేదని అడిగితే అసలు ఇవ్వవద్దు. శుక్రవారం రోజు పంచదారను ఇవ్వడం వల్ల ఇంట్లోని లక్ష్మీ దేవి ఇతరుల ఇంటికి వెళ్లిపోతుందని పండితులు అంటున్నారు. అలాగే శుక్రవారం రోజు ఇంటి నుంచి అసలు డబ్బు ఎవరికి అప్పుగా ఇవ్వవద్దు. తప్పని సమయంలో అయితే ఇవ్వచ్చు. కానీ ఎక్కువ శాతం ఇవ్వకపోవడమే మంచిది.
శుక్రవారం రోజు బంగారం, ఆస్తులు వంటివి కొనుగోలు చేయాలని పండితులు అంటున్నారు. వీటిని కొనుగోలు చేయడం వల్ల ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్లే అని భావిస్తారు. అలాగే ఈ రోజు ఆస్తులు, బంగారం అమ్మకూడదని పండితులు అంటున్నారు. ఎందుకంటే వీటిని అమ్మితే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది. అలాగే శుక్రవారం రోజు మురికిగా ఉన్న బట్టలు అసలు వేసుకోకూడదు. మురికి ఉన్న బట్టలు ఉతకకూడదు. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది. అలాగే ఈ రోజు ఇంట్లో మాంసం వండకూడదు, తినకూడదు. ఇలా చేస్తే తప్పకుండా ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుందని పండితులు అంటున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.