https://oktelugu.com/

Therapy: సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.. ఒక్కసారి ఈ థెరపీ తీసుకుని చూడండి

కళ్లు మూసుకున్న కూడా మీకు ఏవేవో ఆలోచనలు, ఒత్తిడిగా అనిపిస్తుంది. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే తొందరగా ఒత్తిడి నుంచి విముక్తి పొందాలి. అప్పుడే జీవితం సాఫీగా ఉంటుంది. అయితే ఒత్తిడి నుంచి విముక్తి పొందాలంటే ఒక థెరపీ ఉంది. దీనివల్ల ఈజీగా ఒత్తిడి నుంచి విముక్తి పొందవచ్చు. ఎలాగో మరి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 24, 2024 / 01:35 AM IST

    therapy

    Follow us on

    Therapy: రోజుల్లో చాలామంది శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలతో కూడా ఇబ్బంది పడుతున్నారు. జీవనశైలిలో మార్పులు, ఆందోళన, మద్యం, ధూమపానం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల చాలా మంది ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా సంతోషంగా ఉండాలి. ఎలాంటి ఒత్తిడి, ఆందోళన లేకపోతేనే మానసికంగా సంతోషంగా ఉంటారు. ఒత్తిడికి బాగా గురైతే కొన్ని అనారోగ్య సమస్యల బారిన కూడా పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాగా ఒత్తిడికి గురైతే మైండ్ ఆలోచించే విధానం పూర్తిగా మారిపోతుంది. కొందరు అయితే అసలు ఏ విషయాన్ని కూడా పూర్తిగా ఆలోచించలేరు. ఏ విషయం గురించి అయిన ఎక్కువగా ఆలోచించడం, ఒత్తిడికి లోనవడం, డిప్రెషన్‌లోకి వెళ్లడం వంటివి జరుగుతాయి. ఒక్క నిమిషం కళ్లు మూసుకున్న కూడా మీకు ఏవేవో ఆలోచనలు, ఒత్తిడిగా అనిపిస్తుంది. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే తొందరగా ఒత్తిడి నుంచి విముక్తి పొందాలి. అప్పుడే జీవితం సాఫీగా ఉంటుంది. అయితే ఒత్తిడి నుంచి విముక్తి పొందాలంటే ఒక థెరపీ ఉంది. దీనివల్ల ఈజీగా ఒత్తిడి నుంచి విముక్తి పొందవచ్చు. ఎలాగో మరి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

    ఒత్తిడి నుంచి విముక్తి పొందాలంటే తప్పకుండా జాయింట్ థెరపీ తీసుకోవాలి. ఈ థెరపీని తీసుకోవడం వల్ల కుటుంబంలో ఒత్తిడి నుంచి విముక్తి పొంది అందరితో కలిసి సంతోషంగా ఉంటారు. కొందరు బాగా డిప్రెషన్‌లోకి వెళ్లి కుటుంబ సభ్యులతో కూడా సరిగ్గా ఉండరు. ఎప్పుడూ వారితో గొడవ పడుతూనే ఉంటారు. అదే ఈ జాయింట్ థెరపీ తీసుకుంటే కుటుంబ సభ్యుల మధ్య బంధాన్ని మెరుగు పరుస్తుంది. అలాగే ఇద్దరి వ్యక్తుల మధ్య ఉన్న సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. కొందరు బాగా ఒత్తిడికి గురై కుటుంబ సభ్యులతో గొడవ పడుతూనే ఉంటారు. అలాంటి వారు ఈ థెరపీ తీసుకోవడం వల్ల ఇద్దరి మధ్య సఖ్యత పెరుగుతుంది. అలాగే మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అయితే కుటుంబం మొత్తం గొడవలు ఉంటే మాత్రం అందరూ కలిసి జాయింట్ థెరపీ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మానసికంగా వేదన చెందుతున్నట్లయితే ఇలా థెరపీ చేయించుకోవాలి. దీనివల్ల మీరు సంతోషంగా అందరితో కలిసి ఉంటారు.

    సాధారణంగా ప్రతీ ఇంట్లో గొడవలు అనేవి సహజం. కేవలం భార్యా భర్తలకే కాకుండా కుటుంబ సభ్యుల్లో కొడుకు, కుమారుడు ఇలా ప్రతీ ఒక్కరికి గొడవలు ఉంటాయి. వీటి నుంచి విముక్తి చెందడానికి ప్రతీ ఒక్కరూ కూడా జాయింట్ థెరపీ చేయించుకోవడం వల్ల ఎలాంటి విభేదాలు ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి. వారి మధ్య కమ్యూనికేషన్ పెరుగుతుంది. అలాగే గొడవలు అన్నింటికి కూడా చెక్ పెట్టి సంతోషంగా ఉంటారు. ఇలా ఎవరి మధ్య అయిన మనస్పర్థలు వస్తే ఈ థెరపీ చేయించుకోవాలి. ఈ రోజుల్లో చాలా మంది దగ్గర వారితో గొడవపడి ఎక్కువగా మానసికంగా సమస్యలను ఎదుర్కొంటున్నారు. అదే వారి మధ్య గొడవలు లేకపోతే ఈ సమస్యే ఉండదు. ఇంట్లో జరిగిన చిన్న గొడవలు కూడా కొన్నిసార్లు ఒత్తిడికి కారణమయ్యేలా చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ థెరపీ చేయించుకోవడం ముఖ్యం.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.