https://oktelugu.com/

Black water: సెలబ్రిటీలు బ్లాక్ వాటర్ ఎందుకు తాగుతారు? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?

సెలబ్రిటీలు ఎక్కువగా బ్లాక్ వాటర్ తాగుతుంటారు. సినిమా వారి నుంచి క్రికెటర్లు, బిజినెస్‌మ్యాన్‌లు ఇలా అందరూ కూడా ఈ బ్లాక్ వాటర్‌కి ప్రాధాన్యత ఇస్తారు. మరి ఈ బ్లాక్ వాటర్ అంటే ఏమిటి? దీనిని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 24, 2024 / 03:48 AM IST

    Black water

    Follow us on

    Black water: ఆరోగ్యానికి నీరు చాలా మంచివి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతీ జీవికి నీరు ముఖ్యమే. నీరు లేకపోతే మనిషి అసలు జీవించలేడు. డైలీ నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. నీరు తాగడం వల్ల బాడీ హైడ్రేట్ కాకుండా ఉంటుంది. అయితే చాలా మంది దాహం వేసినప్పుడు నీరు తాగుతుంటారు. మరికొందరు ఆరోగ్యానికి మంచిదని తాగుతుంటారు. అయితే ఈ నీటిలో చాలా రకాలు ఉన్నాయి. ఉదాహరణకు చూసుకుంటే ఎక్కువ మంది మినరల్ వాటర్ తాగుతున్నారు. సాధారణ నీరు కంటే ఈ ఫిల్టర్ చేసిన నీరు ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. అయితే కొందరు సెలబ్రిటీలు మాత్రం బాగా కాస్ట్లీ ఉండే వాటర్ తాగుతుంటారు. ఇలాంటి వాటర్ తాగడం వల్ల వారు ఎక్కువ కాలం జీవించి ఉండటంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటారు. అయితే సెలబ్రిటీలు ఎక్కువగా బ్లాక్ వాటర్ తాగుతుంటారు. సినిమా వారి నుంచి క్రికెటర్లు, బిజినెస్‌మ్యాన్‌లు ఇలా అందరూ కూడా ఈ బ్లాక్ వాటర్‌కి ప్రాధాన్యత ఇస్తారు. మరి ఈ బ్లాక్ వాటర్ అంటే ఏమిటి? దీనిని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

    బ్లాక్ వాటర్‌ను ఆల్కలీన్ వాటర్ అని కూడా అంటారు. రోజూ ఈ వాటర్‌ను తాగడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. ముఖ్యంగా యంగ్ లుక్‌లో ఫిట్‌గా ఉంటారు. అందుకే ఎక్కువ మంది సెలబ్రిటీలు ఈ వాటర్‌ను తాగుతుంటారు. అయితే ఈ ఆల్కలీన్ ద్రావణం నలుపు రంగులో ఉంటుంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. సాధారణ నీరు కంటే నల్ల నీటిలో ఎక్కువ ఫుల్విక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఒక సహజ సేంద్రీయ సమ్మేళనం. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి అనేక రకాలు ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా సహాయపడుతుంది. అయితే ఈ పుల్విక్ యాసిడ్ అనేది నీటితో కలిస్తే నలుపు రంగు వస్తుంది. అందుకే దీనిని బ్లాక్ వాటర్ అని పిలుస్తారు. బ్లాక్ వాటర్ తాగడం వల్ల శరీరంలో మెటబాలిజం ప్రక్రియ వేగవంతం అవుతుంది.

    బ్లాక్ వాటర్‌లో ఉండే పోషకాల వల్ల కడుపులో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీనివల్ల జీర్ణశక్తి బలపడుతుంది. అలాగే ఎసిడిటీ సమస్య ఉండదు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ వాటర్ను తాగడం వల్ల అనేక ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. సాధారణ నీటిలో కంటే నల్ల నీటిలో కొన్ని ఖనిజాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా సహాయపడతాయి. అలాగే ఇందులో విటమిన్లు, సప్లిమెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఆల్కలీన్ నీరు కడుపులో ఆమ్లత్వం సమస్యలు ఉన్నవారికి బాగా ఉపయోగపడుతుంది. అందుకే కాస్త రేటు ఎక్కువ అయిన కూడా సెలబ్రిటీలు ఈ బ్లాక్ వాటర్‌ను ఎక్కువగా తాగుతుంటారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.