Sri Rama Navami: నేడు శ్రీరామనవమి.. దేశవ్యాప్తంగా రామనామం ప్రతిధ్వనించింది. ప్రతి గుడిలో జైశ్రీరామ్ అనే నినాదం ప్రభవించింది. అయోధ్య నుంచి దక్షిణ అయోధ్య దాకా రామస్మరణతో ఓలలాడింది.. శ్రీరామనవమి వేడుకలతో ప్రతి ఆలయం ఆధ్యాత్మిక శోభ ను సంతరించుకుంది. అన్నదానాలు, వడపప్పు, బెల్లం పానకం వితరణ జోరుగా సాగింది. అయితే శ్రీరామనవమిని పురస్కరించుకొని దేశ ప్రజలకు ట్విట్టర్ ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు.
అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో ప్రత్యేక వేడుకలు జరిపారు. సూర్యవంశీయుడి నుదుటన సూర్యకిరణాలపడేలాగా ఏర్పాటు చేశారు. అశేష భక్త జనవాహిని మధ్య జరిగిన ఈ వేడుక ఆద్యంతం కన్నుల పండువగా సాగింది. వేలాది మంది భక్తులు జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తుండగా ఈ క్రతుకు జరిగింది.. దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. రామ జన్మభూమి జన్మభూమి ఈ కార్యక్రమాన్ని తన అధికారిక ఖాతాలో లైవ్ టెలికాస్ట్ చేయగా.. ఆ వీడియోను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రీ ట్వీట్ చేశారు. అంతకు ముందు నరేంద్ర మోడీ పోస్ట్ చేసిన ఓ వీడియోలో దేశ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. “అయోధ్యలో రాముడి కి ఆలయం నిర్మించి.. బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించిన తర్వాత తొలిసారి వచ్చిన శ్రీరామనవమి వేడుక ఘనంగా జరుగుతోంది. ఎక్కడెక్కడ నుంచో భక్తులు అయోధ్యకు వస్తున్నారు. బాల రాముడిని దర్శించుకుంటున్నారు. వారందరిపై, ఈ దేశంపై రామ్ లలా కరుణ కటాక్షాలు ఉండాలని.. ఈ దేశం మరింత వృద్ధిలో కొనసాగాలని ఆ రాముడుని కోరుకుంటున్నానని” ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ట్విట్టర్ వీడియోలో పేర్కొన్నారు.
శ్రీరామనవమికి సంబంధించి ఒక వీడియోలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ వీడియోలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తను చేసిన వ్యాఖ్యలను జోడించారు..”రాముడు మన ఆత్మ. రాముడు మన గౌరవం. రాముడు వివాదం కాదు. రాముడు సమాధానం. రాముడు మన విధానం.. రాముడంటే నీతి.. రాముడంటే న్యాయం.. రాముడంటే ధర్మం..” అంటూ అప్పట్లో మోడీ చేసిన వ్యాఖ్యలను ఈ వీడియోలో ప్రస్తావించారు. రామ నవమి సందర్భంగా రూపొందించిన ఈ వీడియో ఇప్పటికే లక్షల్లో వ్యూస్ నమోదు చేసింది. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు నేపథ్యంలో మోడీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన వీడియోను భారతీయ జనతా పార్టీ నాయకులు రీ – ట్వీట్ చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
राम भारत की आस्था है, राम भारत का आधार है… pic.twitter.com/iyZm0ponNm
— Narendra Modi (@narendramodi) April 17, 2024