Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు కొత్త పోస్టర్ ఒకే..మరి సినిమా ఎప్పుడు..?

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉన్న సమయం లో అన్ని డేట్స్ ని కేటాయించలేడు. కాబట్టి ఈ సినిమాని హోల్డ్ లో పెట్టి మిగిలిన సినిమాలను చేసే ప్రయత్నం అయితే చేశాడు.

Written By: Gopi, Updated On : April 17, 2024 3:10 pm

Hari Hara Veera Mallu

Follow us on

Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ డైరెక్షన్ లో “హరిహర వీరమల్లు” అనే సినిమా నాలుగు సంవత్సరాల క్రితం మొదలైంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఎంత వరకు జరుగింది. ఎప్పుడు పూర్తవుతుంది. అసలు సినిమా షూట్ నడుస్తుందా? లేదా మొత్తానికే సినిమాను ఆపేసారా? అనే విషయాలు మొన్నటిదాకా అభిమానుల మదిలో మెదిలాయి…

ఇక “శ్రీరామనవమి” పండుగ సందర్భంగా సినిమా యూనిట్ ఈ సినిమాకి సంబంధించిన కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇక అందులో “ధర్మం కోసం యుద్ధం” అంటూ ఒక డైలాగ్ ను కూడా రాశారు. ఇక దానికి తోడుగా పవన్ కళ్యాణ్ కండ్లను హైలైట్ చేస్తూ ఈ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఈ పోస్టర్ ను చూసిన చాలామంది సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా మీద పవన్ కళ్యాణ్ మీద విపరీతమైన ట్రోల్లింగ్స్ అయితే చేస్తున్నారు.

ఇక ఈ సినిమా దాదాపు నాలుగు సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయింది. అయినా కూడా ఈ సినిమా ఎంత వరకు పూర్తయింది. ఎప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అనే విషయం మీద ఇప్పటివరకైతే ఒక క్లారిటీ కూడా ఇవ్వడం లేదు. మరి ఇలాంటప్పుడు ఈ సినిమాని పవన్ కళ్యాణ్ ఎందుకు ఒప్పుకున్నట్టు.. ఒకవేళ ఒప్పుకున్న ఈ సినిమాను ఎందుకు చేయకుండా అలాగే వదిలేస్తున్నట్టు అంటూ పవన్ కళ్యాణ్ మీద విమర్శల అస్త్రాలను సంధిస్తున్నారు. ఇక మొత్తానికైతే డైరెక్టర్ క్రిష్ కూడా ఈ సినిమాని పక్కన పెట్టి ఇప్పుడు అనుష్క తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. మరి ఈ సినిమా విషయంలో ఇంత లేట్ అవ్వడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ డేట్స్ అనే చెప్పాలి. అయితే ఈ సినిమా కోసం కంటిన్యూస్ గా ఒక రెండు నెలల పాటు డేట్స్ ని కేటాయించాల్సి ఉంటుంది.

దానివల్ల పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉన్న సమయం లో అన్ని డేట్స్ ని కేటాయించలేడు. కాబట్టి ఈ సినిమాని హోల్డ్ లో పెట్టి మిగిలిన సినిమాలను చేసే ప్రయత్నం అయితే చేశాడు. అందువల్లే ఈ సినిమాకి ఎలక్షన్స్ తర్వాత ఫుల్ గా డేట్స్ ని కేటాయించి ఫినిష్ చేసే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా 2025 సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది…