Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని పనులు చేయడంవల్ల అనుకూల ఫలితాలు ఉండే అవకాశం ఉంది. ప్రతిరోజూ ప్రతి వ్యక్తికి ఏదో ఒక రూపంలో సహకారం ఉంటుంది. అలాంటి విషయాలను ఆస్ట్రాలజీ తెలుపుతుంది. ఈ శాస్త్రం ప్రకారం 2023 అక్టోబర్ 10న మంగళవారం 12 రాశిఫలాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
శ్రమ పెరుగుతుంది. కీలక నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం మంచిది. కొన్ని రంగాల వారు ముందు చూపుతో వ్యవహరించాలి. ఈ రాశివారు శివపూజ చేయడం శ్రేష్టం.
వృషభం:
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఒక సమాచారం మానసికంగా ఉత్సాహాన్ని ఇస్తుంది. వాదనలకు దిగకుండా మనసు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వల్ల మేలు జరుగుతుంది.
మిథునం:
తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కొన్ని సమస్యలు తగ్గుముఖం పడుతాయి. అధికారులతో మంచిగా ప్రవర్తించండి. శ్రీ వేంకటేశ్వరస్వామిని పూజించడంతో అనుకూల ఫలితాలు ఉంటాయి.
కర్కాటకం:
ఇతరుల నుంచి గౌరవాలు పొందుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కొన్ని పనుల్లో విజయం సాధిస్తారు. బంధువులతో విభేదాలు ఉండే అవకాశం ఉంది. వారితో జాగ్రత్తగా ఉండాలి. విష్ణు ఆరాధన మేలు.
సింహం:
కొత్త వస్తువుల కొనుగోళ్లలో బిజీ అవుతారు. కొందరి సహకారంతో ఓ సమస్య పరిష్కారం అవుతుంది. ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి. హనుమాన్ చాలీసా చదివితే మరింత మంచి జరుగుతుంది.
కన్య:
ఉద్యోగం చేసేవారు ఆచితూచి వ్యవహరించాలి. ఒక సమాచారం నిరుత్సాహ పరుస్తుంది. ఇబ్బందులు కలిగించే పనులు వాయిదా వేసుకోవడమే మంచిది. శ్రీ వేంకటేశ్వరుడిని పూజిస్తే అంతా మంచే జరుగుతుంది.
తుల:
ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం. సమయానుకూలంగా వ్యవహరించండి. మనోబలంతో కీలక వ్యవహారం నుంచి బయటపడుతారు. శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడం ద్వారా అనుకున్నవి జరుగుతాయి.
వృశ్చికం:
తెలివిగా కొన్ని పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఉద్యోగార్థులు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. శ్రీ లక్ష్మీ అష్టకాన్ని చదవాలి.
ధనస్సు:
కుటుంబంలో విభేదాలు ఉండొచ్చు. చేసే పనుల్లో ఆటంకాలు ఎదురైనా ముందుకు వెళ్తారు. కొన్ని సంఘటనలు మనస్తాపానికి గురి చేస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఇష్టదైవాన్ని పూజించాలి.
మకరం:
ఇతరులతో అభిప్రాయ భేదాలు ఉండే ఛాన్స్. అప్రమత్తంగా ఉండాలి. బంధుమిత్రులతో వాదనలకు దిగొద్దు. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. విష్ణుదైవారాధన చేయాలి.
కుంభం:
గతంలో చేపట్టిన పనులు విజయం సాధిస్తాయి. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో సక్సెస్ సాధిస్తారు. దైవబలం అధికంగా ఉంటుంది. ఇష్టదైవాన్ని పూజించాలి.
మీనం:
ఒక సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇష్టదేవుడిని పూజించాలి.