Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 ఫిబ్రవరి 29న ద్వాదశ రాశులపై చిత్రా నక్షత్ర ప్రభావం ఉంటుంది. గురువారం చంద్రుడు తులా రాశిలో సంచరించనున్నాడు. దీంతో ఓ రాశి వారికి అధిక ప్రయోజనాలు ఉంటాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. స్నేహితుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. భూమి ఆస్తికి సంబంధించిన విషయాలు కొలిక్కి వస్తాయి.
వృషభ రాశి:
శుభవార్తలు వింటారు సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖర్చులు చేయాలి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం.
మిధునం:
గతంలో తీసుకున్న రుణాలను చెల్లించడంలో విజయం సాధిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం బాగుంటుంది. ఎక్కువగా వాదనలకు దిగకపోవడం మంచిది.
కర్కాటకం:
ఇంట్లోని విషయాలు బయట వ్యక్తులకు చెప్పద్దు. సోదరులతో సత్సంబాలు మెరుగుపడతాయి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచనాత్మకంగా వ్యవహరించాలి
సింహ:
కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు ఉంటాయి. ఇతరులతో పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవద్దు.వివాహ ప్రతిపాదనలు ఉంటారు. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో ఆలోచించాలి.
కన్య:
వ్యాపారుల పెట్టుబడులకు అనుకూల సమయం. ఉద్యోగులకు వివాహ ప్రతిపాదనలు ఉంటాయి. ఇతరుల నుంచి రుణం పొందుతారు. ఖర్చులు పొదుపుగా చేయాలి.
తుల:
జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. వ్యాపారంలో కొత్త ప్రణాళిక కోసం ఇతరులను సంప్రదించాలి. కెరీర్ విషయంపై దృష్టి పడతారు. ఉద్యోగులకు సీనియర్ల మద్దతు ఉంటుంది.
వృశ్చికం:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆలోచన ఆత్మకంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇతరులతో వాగ్వాదం ఉండే ఆవకాశం. అందువల్ల ఎక్కువగా వాదనలు చేయకుండా ఉండడమే మంచిది. పదవీ విరమణ చేసే వ్యక్తులకు ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి.
ధనస్సు:
ఏదైనా పనిని మొదలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులు కొత్త ప్రణాళికలు చేస్తారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో ఆహ్లాదకరమైన వాతావరణము ఉంటుంది.
మకర:
ఆర్థిక వ్యవహారాల విషయంలో కుటుంబ సభ్యుల సలహాతీసుకోవాలి. విద్యార్థులు ఉపాధ్యాయుల సహాయంతో ప్రాజెక్ట్ సక్సెస్ చేస్తారు. కొన్ని విషయాల్లో ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారుల పెట్టుబడులకు అనుకూలం.
కుంభం:
వ్యాపారులకు ఈరోజు లాభదాయకం. ఉద్యోగులు నిర్ణయాలు తీసుకునేటప్పుడు సీనియర్లను సంప్రదించాలి. ఆర్థిక ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
మీనం:
కొన్ని పనులు పూర్తి కాకపోవడంతో నిరాశతో ఉంటారు. వ్యాపారులు పెట్టుబడులు కు దూరంగా ఉండాలి. ఉద్యోగులకు స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.