Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 జనవరి 22 సోమవారం మేష, కన్య, మిథున రాశుల వారి సంపద పెరగనుంది. మిగిలిన కొన్ని రాశుల వారికి అనవసరపు ఖర్చులు ఉంటాయి. కొన్ని రాశుల ఉద్యోగులు తోటివారితో జాగ్రత్తగా ఉండాలి. ఈ సందర్భంగా 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
మేషరాశి:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆకస్మిక ఆదాయం వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారులు గతంలో పెట్టిన పెట్టుబడులకు లాభాలు పొందుతారు.
వృషభం:
ఉద్యోగులు చాకచక్యంగా విధులు నిర్వహించాలి. లేదంటే తోటి వారితో ఇబ్బందులు ఏర్పడుతాయి. వ్యాపారులు కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొంటారు.
మిథునం:
ఈ రాశివారు ఈరోజు ఉల్లాసంగా ఉంటుంది. గతంలో కంటే సంపద పెరుగుతుంది. బంధువులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పనులు ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా చేసేందుకు ప్రయత్నించాలి.
కర్కాటకం:
వ్యాపారస్తులు అనేక ప్రణాళికలతో ముందుకు వెళ్తారు. ఆదాయం పెరుగుతుంది.శారీరక సమస్యలు ఇబ్బందులు పెడుతాయి. ఉద్యోగులు తోటి వారితో జాగ్రత్తగా ఉండాలి.
సింహ:
వ్యాపారులకు ప్రతికూల వాతావరణం. కొన్ని ఆలోచనలు ఇబ్బంది పెడుతాయి. తోటి వారు సహకరించకపోవచ్చు. ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా జరుపుతారు.
కన్య:
ఆదాయం తగ్గుతుంది. ఉద్యోగులకు కార్యాలయాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. పెట్టుబడులు పెట్టేవారికి అనువైన రాబడులు రావొచ్చు.
తుల:
కొన్ని ప్రణాళికలు దెబ్బతింటాయి. ఆర్థికాంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. సామాజిక ప్రయోజనాల కోసం ఖర్చులు చేయాల్సి వస్తుంది. కటుుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు వస్తాయి.
వృశ్చికం:
ఆర్థికాదాయం తక్కువగానే ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయాల్లో తోటివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు:
ముఖ్యమైన పనులు ఉంటే వాయిదాలు వేసుకోవడం మంచిది. ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఆర్థికపరంగా మెరుగైన ఫలితాలు పొందుతారు.
మకర:
వ్యాపారులు తమ కార్యకలాపాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు కాస్త ఇబ్బంది వాతావరణమే ఉంటుంది. కుటుంబవిషయాల పట్ల శ్రద్ధ వహించాలి.
కుంభం:
కొందరు మిమమ్మల్ని తప్పుదోవ పట్టించొచ్చు. అనుకున్న ఆదాయం ఉండదు. ఉద్యోగులు కార్యాలయాల్లో తోటివారితో మంచిగా ప్రవర్తించాలి. ఏ పని చేసినా శ్రద్ధ వహింాచలి.
మీనం:
కొన్ని మార్గాల ద్వారా అనుకోని ఆదాయం వస్తుంది. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. చేసే పనిపై శ్రద్ధవహించాలి. ఉద్యోగులు సహోద్యోగులతో ఉల్లాసంగా ఉంటారు.