Pushpa 2 Trailer : సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తుంది అంటే ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో అంచనాలు తార స్థాయి లో ఉంటాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన స్టాండర్డ్ ఆ లెవెల్లో ఉంటుంది. ఒక సినిమాని తీసి సక్సెస్ చేయడంలో ఆయనను మించిన డైరెక్టర్ మరెవరు లేరు అనేది మాత్రం వాస్తవం.
ఇక రీసెంట్ టైంలో ఆయన తీసిన సినిమాలు వరుసగా మంచి సక్సెస్ లను సాధిస్తూ వస్తున్నాయి. నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప లాంటి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకొని ప్రస్తుతం ఉన్న దర్శకులలో టాప్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన పుష్ప 2 సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా మీద ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు అయితే ఉన్నాయి. ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ కూడా అందరిని ఆకట్టుకుంది. దాంతో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఎప్పుడు వస్తుందంటు ప్రేక్షకులు విపరీతంగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా యూనిట్ నుంచి ఒక సమాచారం అయితే అందుతుంది.అదేంటంటే ఫిబ్రవరి 15వ తేదీన ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యం లో సినిమా యూనిట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక దాంతో మరోసారి పుష్ప 2 సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చి వదిలేయాలనే ఉద్దేశ్యం లో సుకుమార్ ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక టీజర్ వచ్చాక ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేయాలనే దానిమీద ఫోకస్ చేయనున్నట్టు గా తెలుస్తుంది. ఇక ఫిబ్రవరి 15 కి టీజర్ వస్తే ఆ తర్వాత నుంచి ఒక్కో సాంగ్ ని కూడా రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యం లో సుకుమార్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో భారీ కలెక్షన్లను రాబట్టడమే లక్ష్యంగా అల్లు అర్జున్, సుకుమార్ ఇద్దరు మంచి కసరత్తులను చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే వీళ్లది సూపర్ హిట్ కాంబో కావడం వల్ల ఈ సినిమా కూడా అంతకు మించి అనేలా ఉండబోతుంది అని చిత్ర యూనిట్ చెబుతున్నట్టు గా తెలుస్తుంది. కాబట్టి దానికి తగ్గట్టుగానే ఈ సినిమా సక్సెస్ కూడా భారీ రేంజ్ లో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది…