Negative Energy in House: ఒక్కోసారి మనం అనుకున్న పనులు పూర్తి చేయాలని ఎంతో కష్టపడుతూ ఉంటాం. కానీ అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా అకస్మాత్తుగా అనారోగ్యం రావడం. వరుసగా కుటుంబ సభ్యులందరూ ఆసుపత్రిలోకి వెళ్లాల్సి రావడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో డబ్బు నీళ్లలా ఖర్చవుతుంది. ఇందుకు కారణమేంటో తెలియదు.. అయితే ఇటువంటి సమయంలోనే ఆధ్యాత్మిక ప్రకారంగా కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. ఇంట్లో ఎప్పటికీ నెగటివ్ ఎనర్జీ ఉంటుందంటే.. అందుకు కారణమేంటో తెలుసుకోవాలి. అంతేకాకుండా ఆ నెగటివ్ ఎనర్జీని పారద్రోలడానికి కొన్ని పరిహారాలు చేయాల్సి ఉంటుంది. అసలు ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందనడానికి ఎలాంటి సంకేతాలు ఉంటాయి? దీనిని తొలగించుకునేందుకు ఏం చేయాలి?
Also Read: బంగారం, వజ్రాలు సాటి రావు.. ఈ చెట్టు కిలో కలప కోటి రూపాయలు.. ఇంతకీ దీని విశిష్టతలు ఏమిటంటే..
ఇల్లు కట్టుకోవాలని లేదా కొత్త ఇల్లు కొనుక్కోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. మరి కొంతమంది మాత్రం సెకండ్ హ్యాండ్ ఇళ్లను కొనుక్కుంటారు. తక్కువ ధరలో ఇల్లు వస్తుంది కదా అని చాలామంది ఈ పని చేసి ఆ ఇంట్లోకి వెళ్తారు. అయితే ఇంట్లోకి వెళ్లినప్పటి నుంచి కొందరికి అనుకోకుండా అనారోగ్యం ప్రారంభమవుతుంది. ఇలా ఒకరి తర్వాత కుటుంబ సభ్యులు అంతా ఏదో ఒక వ్యాధి బారిన పడుతూ ఉంటారు. ఆ తర్వాత రకరకాలుగా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. ఒక్కోసారి ఆ ఇల్లు బాగా కలిసి రాలేదు అని అనుకునే సమయానికి.. దానిని విడిచిపెడదామన్నా.. సాధ్యం కాదు. ఇలాంటి సమయంలో ఏం చేయాలో అర్థం కాదు.
అయితే కొందరు పండితులు చెబుతున్న ప్రకారం ఇలాంటి సంకేతాలు అనిపించినప్పుడు కొన్ని పరిహారాలు చేయాల్సి ఉంటుంది. ఇంట్లో నిత్యం అనారోగ్యాల సమస్యలు వస్తూ ఉంటే ముందుగా ఆ ఇల్లుకు కొన్ని రోజులపాటు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఒకవేళ అది సొంత ఇల్లు అయితే.. కొన్ని రోజులపాటు ఇతర ఇంట్లో అద్దెకు ఉండి చూడాలి. ఈ సమయంలో మార్పు ఉంటే ఆ సొంత ఇల్లును వదిలించుకోవడమే మంచిది. అలా కాకుండా ఇల్లును విడిచిపెట్టిన కూడా ఒక్కోసారి సమస్యలు తొలగిపోవు.
Also Read: హమ్మయ్య.. ఇక బంగారం కొనొచ్చు.. భారీగా తగ్గిన ధరలు..
ఈ సమస్యలు ఉండడానికి పూర్వీకుల ఆక్రోష లేదా కొన్ని దుష్టశక్తుల ప్రభావం కూడా ఉంటుంది. ఎక్కువ శాతం కుటుంబ సభ్యుల్లో ఉండే సమస్యలు పూర్వికుల ఆవేదన నుంచే ఉంటుందని చెబుతారు. ఇంట్లో తరచూ సమస్యలు ఉన్నాయంటే పెద్దల ఆత్మ సంతృప్తిగా లేదని అర్థం చేసుకోవాలి. అందుకోసం పరిహారం చేయాలి. అలా కానప్పుడు ఏవైనా దుష్టశక్తులు ఇబ్బంది పెడుతున్నాయంటే వాటికి సంబంధించిన పరిహారాలను పూర్తిచేయాలి.
మొత్తంగా ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీని దూరం చేయడానికి ప్రయత్నించాలి. అయితే నెగిటివ్ ఎనర్జీ వెళ్లడానికి ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇంట్లో చెత్తాచెదారం, దుమ్ము వంటివి ఉంటే దుష్టశక్తులు వీటిని నివాసాలుగా ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడితే పరుష పదాలు వాడకుండా సమస్యను వెంటనే పరిష్కరించేందుకు ప్రయత్నం చేయాలి.