https://oktelugu.com/

Moodam Days: మూఢం ఉన్న రోజుల్లోనూ ఈ శుభకార్యాలు చేయొచ్చు..

ఒక పాప లేదా బాబు పుట్టిన 21 రోజులకు నామకరణం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. దీనికి మంచిరోజుతో పనిలేదు. కచ్చితంగా ఆరోజు రాగానే అదే రోజు మంచిరోజుతో సంబంధం లేకుండా నిర్వహిస్తారు. దీనిని మూఢాలతో పని లేకుండా నిర్వహించుకోవచ్చు.

Written By:
  • Srinivas
  • , Updated On : April 30, 2024 / 03:17 PM IST

    moodam days

    Follow us on

    Moodam Days: క్రోధి నామ సంవత్సరం ప్రారంభంలో మంచిరోజులు ఉండేవి. దీంతో పెళ్లిళ్లు, శుభకార్యాలు జోరుగా సాగాయి. అయితే ఈ ఏడాదిలో మే తరువాత నుంచి మూడు నెలల పాటు మూఢాలున్నాయని కొందరు పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యా లు నిర్వహించరాదని చెబుతున్నారు. పెళ్లిల్లు, గృహ ప్రవేశం లాంటివి చేసుకోవద్దని అంటున్నారు. కానీ ఇవి కాకుండా కొన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చని మరికొందరు పండితులు చెబుతున్నారు. అవేంటంటే.

    మహిళలు పురుడు పోసుకునన తరువాత సీమంతం జరుపుతూ ఉంటారు. ఈ ఆచారం అందరి ఇళ్లల్లో ఉండదు. కానీ ఈ కార్యక్రమాన్ని జరుపుకునేవారు మాత్రం ఘనంగా నిర్వహించుకుంటారు. అయితే ఇప్పుడు వచ్చే మూఢంలో సీమంతం కార్యక్రమాన్ని నిరభ్యరంతరంగా జరుపుకోవచ్చని పండితులు చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి మూఢంతో సంబంధం లేదని అంటున్నారు.

    చిన్న పిల్లలకు నిర్ధిష్ట వయసు రాగానే అన్న ప్రసన జరిపిస్తూ ఉంటారు. ఒక బాబు లేదా పాప తన జీవితంలో మొదటిసారి ఆహారాన్ని తీసుకునే కార్యక్రమం. దీనినికొందరు ఘనంగా నిర్వహిస్తారు. అయితే దీనికి ప్రత్యేకంగా మంచిరోజులు ఉండాల్సిన అవసరం లేదు. మూఢాలల్లోనూ నిరభ్యరంతంగా నిర్వహించుకోవచ్చు.

    ఒక పాప లేదా బాబు పుట్టిన 21 రోజులకు నామకరణం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. దీనికి మంచిరోజుతో పనిలేదు. కచ్చితంగా ఆరోజు రాగానే అదే రోజు మంచిరోజుతో సంబంధం లేకుండా నిర్వహిస్తారు. దీనిని మూఢాలతో పని లేకుండా నిర్వహించుకోవచ్చు.

    విదేశాలకు వెళ్లాలని చాలా మంది అనుకుంటారు. ఇలాంటి వారు మంచి రోజులను పట్టించుకోవాల్సని అవసరం లేదు. ఎందుకంటే వీసా దొరికినప్పుడు వెంటనే వెళ్లిపోవడం మంచిది. లేకుండా సమయం వృథా అవుతుంది. కొత్త వాహనాలు కొనుగోలు చేసేవారు సైతం మూఢాల గురించి చూడొద్దు. ఎందుకంటే కొందరు అత్యవసరంగా వాహనం కావాల్సి ఉంటుంది. వీరు మూఢాల కోసం చూస్తే అవసరం తీరదు.