Mars will enter Gemini in February
Zodiac Signs : వేద శాస్త్రం ప్రకారం ప్రతి ఆరు నెలలకు ఒకసారి గ్రహాల మార్పు ఉంటుంది. కొన్ని గ్రహాల మార్పు వల్ల ఆయా రాశులపై తీవ్ర ప్రభావం ఉంటుంది. గ్రహాలు అన్నింటిలో ప్రతి ఒక్కటి దేనికి అదే ప్రత్యేకతను కలిగి ఉంటుంది. వీటిలో కుజ గ్రహం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. కుజ దోషం ఉన్నవారు ఏ పని చేపట్టినా ముందుకు సాగదు. అలాగే వివాహానికి తీవ్ర అడ్డంకులు కలుగుతూ ఉంటాయి. కానీ ఒక్కోసారి ఈ గ్రహం కొన్ని రాశుల్లో ప్రయాణం చేయడం వల్ల మరికొన్ని రాశులపై ప్రభావం పడి వారి జీవితాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఫిబ్రవరి నెలలో కుజుడు మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు. 24వ తేదీ నుంచి కుజుడు తన స్థానాన్ని మార్చు కోవడం వల్ల కొన్ని రాశుల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మరి ఆ రాశులేవో తెలుసుకుందాం..
కుజుడు ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మిధున రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సందర్భంగా ఇదే రాశిపై ప్రభావం పడుతుంది. ఈ రాశి కలిగిన వారు ఊహించని లాభాలు పొందుతారు. పెండింగ్ పనులను పూర్తి చేసుకోగలుగుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొన్ని పనుల్లో నిర్లక్ష్యాన్ని వేడి ముందుకు తీసుకెళ్తారు. ఈ రాశి వారికి ఇప్పటినుంచి జీవిత భాగస్వామి పూర్తి మద్దతు ఉంటుంది. వ్యాపారులు ఎక్కువ లాభాలు పొందుతారు. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడంతో ఉల్లాసంగా ఉంటారు.
కుజుడి సంచారం వల్ల సింహరాశికి అనేక లాభాలు జరగనున్నాయి. ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పెండింగ్ లో ఉన్న బకాయిలు వసూలు అవుతాయి. ఇల్లు, వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి సమయం. ఇంటికి సంబంధించిన కొన్ని ఖర్చులు పెరిగిన అంతవరకు ఆదాయం వస్తుంటుంది. అనుకోని అదృష్టం వల్ల విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. విదేశాల్లో ఉండే వారి నుంచి శుభవార్తలు వింటారు.
కుజుడు తన స్థానాన్ని మార్చుకోవడం వల్ల తులా రాశి వారికి అదృష్టం వరించనుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి భారీగా లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు రావడంతో పదోన్నతులు పొందే అవకాశాలు ఉంటాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారు పెద్దల సలహా తీసుకోవడం మంచిది. అయితే కొత్త ప్రాజెక్టులు చేపట్టే ముందు భాగస్వాములతో చర్చించాలి.
కుజ గ్రహం సాధారణంగా కొన్ని రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు ఉంటుంది. కానీ ఫిబ్రవరి నెలలో కుజ గ్రహం సంచారం వలన ఈ మూడు రాశుల వారికి అనేక ప్రయోజనాలను తీసుకొస్తుంది. అంతేకాకుండా దోష పరిహారాలు కోసం ఈ సమయంలో పూజలు చేయడం వల్ల కూడా అనుకూల ఫలితాలు ఉంటాయని కొందరు పండితులు చెబుతున్నారు. అలాగే మరికొన్ని రాశులపై పూజాగ్రహం సంచారం ప్రభావం ఉంటుంది. కానీ పై మూడు రాశుల వారికి అదృష్టం వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.