https://oktelugu.com/

Akkineni Nagachaitanya: మొట్టమొదటిసారి స్టేజిపై పాట పాడిన నాగ చైతన్య..’తండేల్’ సక్సెస్ మీట్ లో అరుదైన సంఘటన!

చాలా కాలం తర్వాత అక్కినేని నాగచైతన్య(Akkineni Nagachaitanya) 'తండేల్(Thandel)' చిత్రంతో అక్కినేని అభిమానుల్లో అంతులేని ఆనందాన్ని తీసుకొచ్చాడు. గత నాలుగేళ్ల నుండి అక్కినేని కుటుంబం నుండి వచ్చిన ప్రతీ సినిమా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగిలినాయి. ఇక అక్కినేని హీరోలకు సూపర్ హిట్ సినిమాలు చూడలేము ఏమో అని బాధపడుతున్న సమయంలో 'తండేల్' చిత్రం విడుదలైంది.

Written By:
  • Vicky
  • , Updated On : February 11, 2025 / 10:51 PM IST
    Follow us on

    Akkineni Nagachaitanya: చాలా కాలం తర్వాత అక్కినేని నాగచైతన్య(Akkineni Nagachaitanya) ‘తండేల్(Thandel)’ చిత్రంతో అక్కినేని అభిమానుల్లో అంతులేని ఆనందాన్ని తీసుకొచ్చాడు. గత నాలుగేళ్ల నుండి అక్కినేని కుటుంబం నుండి వచ్చిన ప్రతీ సినిమా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగిలినాయి. ఇక అక్కినేని హీరోలకు సూపర్ హిట్ సినిమాలు చూడలేము ఏమో అని బాధపడుతున్న సమయంలో ‘తండేల్’ చిత్రం విడుదలైంది. విడుదలకు ముందే భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న ఈ సినిమా విడుదల తర్వాత ఆ అంచనాలను అందుకోవడం లో సక్సెస్ అయ్యింది. నాగ చైతన్య, సాయి పల్లవి(sai pallavi) మధ్య కెమిస్ట్రీ, బ్లాక్ బస్టర్ సాంగ్స్, నాగ చైతన్య నటన ఈ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లాయి. విడుదలైన నాలుగు రోజుల్లోనే 70 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ ఈవెంట్ ని నేడు హైదరాబాద్ లో గ్రాండ్ గా చేసారు.

    ఈ ఈవెంట్ లో నాగ చైతన్య పాట పాడడం హైలైట్ గా నిల్చిన అంశం. నాగార్జున(Akkineni Nagarjuna) కెరీర్ లో ఆల్ టైం చార్ట్ బస్టర్ గా నిల్చిన ‘హలో గురు ప్రేమకోసమే రోయ్..జీవితం’ అనే పాటని పాడాడు. నాగ చైతన్య పాడుతున్నంత సేపు నాగార్జున ఒక రేంజ్ లో ఎంజాయ్ చేసాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. చివర్లో ఆ వీడియోని చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఈ ఈవెంట్ మొత్తం ఎంతో ఆహ్లాదకరంగా జరిగింది. చాలా కాలం తర్వాత ఒక సక్సెస్ ఈవెంట్ కి వచ్చాను అంటూ నాగార్జున మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. నాగ చైతన్య ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు అని,వాడి కష్టాన్ని చూడలేకపోయేవాడిని అంటూ నాగార్జున చెప్పుకొచ్చినా మాటలు వైరల్ గా మారాయి. అదే విధంగా అల్లు అరవింద్ గురుంచి ఆయన మాట్లాడిన మాటలు కూడా హైలైట్ అంశాలలో ఒకటిగా నిల్చింది.

    ఆయన మాట్లాడుతూ ‘ఇండియా లోనే మొట్టమొదటి వంద కోట్ల రూపాయిల గ్రాస్ కొట్టిన నిర్మాత మా అరవింద్ గారు. ఆయన అమీర్ ఖాన్ తో తీసిన గజినీ చిత్రం హిందీ లో వంద కోట్లు వసూలు చేసింది. చాలా థాంక్యూ అండీ, మా కుటుంబానికి భారీ హిట్స్ అన్ని మీరే అందించారు. అసలు ఈ వయస్సు లో మీరు లవ్ స్టోరీ ని ఎలా జడ్జ్ చేస్తున్నారండీ బాబు’ అంటూ ఆయన సరదాగా మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ప్రసంగం చివర్లో నాగార్జున మాట్లాడుతూ ‘ఇప్పుడు కొట్టింది కేవలం ఆరంభం మాత్రమే, రాబోయే రోజుల్లో..నేను చెప్పను, వాడితోనే చెప్పేస్తాను..వస్తున్నాం’ అని చెప్పి నాగ చైతన్య వద్ద మైక్ పెట్టగా, ‘కొడుతున్నాం’ అంటూ ఫేమస్ డైలాగ్ ని చెప్పిస్తాడు నాగార్జున.