Mahalaya Amavasya Solar Eclipse: ఇటీవలే సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ గ్రహణం భారతదేశంలో సంపూర్ణంగా ఉండడంతో కొందరు జాగ్రత్తలు పాటించారు. మరికొందరు మూఢనమ్మకాలు విశ్వసించోద్దని గ్రహణం సమయంలో చిరుతిళ్లు తింటూ కనిపించారు. ఇదే నెలలో 21వ తేదీన సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఒకే నెలలో రెండు గ్రహణాలు రావడంతో భారత్ లో ఉండే ప్రజలు తమపై ప్రభావం చూపుతోందా? అని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మహాలయ అమావాస్య రోజు ఏర్పడుతున్న ఈ గ్రహణం భారత్ లో ఎలా ఉండబోతుంది అన్న సందేహం చాలా మందిలో ఉంది. మరి ఆ విశేషాల్లోకి వెళితే..
సెప్టెంబర్ 21న మహాలయ అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఈ సమయంలో సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు అడ్డు రానున్నాడు. అయితే ఇది కొన్ని దేశాల్లో మాత్రమే సంపూర్ణంగా ఉండనుంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రం పైనే ఎక్కువగా కనిపిస్తుంది. భారత్లో పాక్షిక సూర్యగ్రహణం మాత్రమే ఉండనుంది. ఈ సూర్యగ్రహణం భారత కాలమాన ప్రకారం.. సెప్టెంబర్ 21 రాత్రి 10:59 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 22 తెల్లవారుజామున 3:23 గంటల వరకు ఉంటుంది. అయితే ఇది భారత్లో పాక్షికంగా మాత్రమే ఉండనుంది.
భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు అడ్డు రావడంతో ఈ గ్రహణం ఏర్పడబోతోంది. అంటే 85% చంద్రుడు అడ్డు వస్తాడు. మరో 25% సూర్యుడు కనిపిస్తాడు. అంటే సూర్యుడు నెలవంక లాగా దర్శనం ఇస్తాడు. ఇది ఉదయం ఉండే దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. అంటే న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో మాత్రమే చూడవచ్చు. యూనివర్సల్ టైం కోఆర్డినేట్ ప్రకారం 19.43 గంటలకు గ్రహణం గరిష్ట స్థాయికి చేరుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ గ్రహణాన్ని ఈక్వినాక్స్ ఎప్లిక్స్ గ్రహణంగా పేర్కొంటున్నారు.ఈక్వినాక్స్ ఎప్లిక్స్ అంటే భూమధ్యరేఖ పై సూర్యుడు రావడం. సెప్టెంబర్ 22న భూమధ్యరేఖ పై సూర్యుడు వస్తున్నాడు. ఒకరోజు ముందు గ్రహణం ఏర్పడుతున్నందున దీనిని అలా పిలుస్తున్నారు.
మహాలయ అమావాస్య రోజున ఏర్పడుతున్నాయి గ్రహణం సింహరాశిలో ఉండనుంది. దీంతో ఈ రాశి వారు గ్రహణంను చూడకపోవడమే మంచిదని కొందరు పండితులు అంటున్నారు. అంతేకాకుండా గ్రహణం రాత్రి సమయంలో ఉండడంతో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ముఖ్యంగా గర్భిణీలు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. అలాగే శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలు గ్రహణ సమయంలో నిర్వహించకూడదని పండితులు చెబుతున్నారు. అయితే ఈ గ్రహణం ఎక్కువగా సముద్ర ప్రాంతాల్లో కనిపించనుంది. అందువల్ల ఇక్కడ సముద్ర పోటు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతంలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మరోవైపు కొందరు గ్రహణంలో వీక్షించాలని సిద్ధమవుతున్నారు.