Homeఆధ్యాత్మికంZodiac Sign : ఈ 4 రాశులపై శ్రీకృష్ణుడి ఆశీర్వాదం ఎక్కువగా ఉంటుంది? ఆ రాశులు...

Zodiac Sign : ఈ 4 రాశులపై శ్రీకృష్ణుడి ఆశీర్వాదం ఎక్కువగా ఉంటుంది? ఆ రాశులు ఏవి అంటే?

Zodiac Sign : హిందూ దేవుళ్లలో శ్రీకృష్ణుడికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. త్రేతా యుగంలో అరేబియా సముద్ర తీరంలో శ్రీకృష్ణుడు జన్మించాడని, ద్వారకా నగరాన్ని నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా మహాభారతం శ్రీకృష్ణుడి కనుసన్నల్లో సాగుతుందని పేర్కొంటారు. అయితే శ్రీకృష్ణుడి లీలలు మాములుగా ఉండవు. ఒక మనిషిని సక్రమ మార్గంలో నడిపించేందుకు ఆ బాల గోపాలగోపాలుడు వివిధ పరీక్షలు పెడూతూ ఉంటాడు. అలాగే తనను నమ్ముకున్న వారికి అన్యాయం కాకుండా చూస్తాడు. ఈ నేపథ్యంలో ప్రతీ ఏడాది ఒకసారి శ్రీకృష్ణుడికి ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. ఆ స్వామి జన్మదినాన్ని శ్రీకృష్ణాష్టమిగా జరుపుకుంటాం. ఈ ఏడాదిలో త్వరలో శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకలు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆ స్వామి గురించి చర్చించుకోవడం ప్రారంభమైంది. శ్రీకృష్ణుడికి కొన్ని రాశులంటే చాలా ఇష్టమట. ఈ రాశులపై ఆయన చల్లని చూపు ఉంటుందని అంటారు. మరి ఆ రాశులు ఏవో తెలుసుకుందాం..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారి జీవితాలు కొందరి దేవళ్ల అనుగ్రహంతో మారిపోతూ ఉంటాయి. అందువల్లే చాలా మంది దైవానుగ్రహం కోసం నిత్యం పూజలు చేస్తుంటారు. ఒక్కోసారి జాతక చక్రం బాగా లేకున్నా..దేవుళ్ల చూపుతో గ్రహాస్థితి మారుతూ ఉంటాయి. విష్ణుకు ప్రతిరూపమైన శ్రీకృష్ణుడిని లయకారుడిగా పేర్కొంటారు. అంటే మనిషి జీవితాన్ని నడిపించేంది ఆయనే. అందువల్ల ఆయన అనుగ్రహం ఉండడానికి చాలా మంది పూజలు చేస్తుంటారు. కానీ శ్రీకృష్ణుడు మాత్రం ఈ రాశుల వారిని నిత్యం గమనిస్తూ ఉంటారట.

జాతక చక్రం ప్రకారం వృషభ రాశి వారి జీవితం ప్రశాంతగా ఉంటుంది. వీరు దైవం పట్ల అంకిత భావంతో ఉంటారు. ఎల్లప్పుడు ఇతరులను ప్రేమిస్తారు. ఇతరులపై తక్కువ కోపాన్ని కలిగి ఉంటారు. వీరు శాంతగా కనిపించినా కొన్ని సందర్భాల్లో వాక్చాతుర్యం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారిపై శ్రీకృష్ణుడు మను పెడుతారు. వీరిని సరైన మార్గంలో నడిపిందేందుకు ప్రణాళికలు వేస్తారు.

కర్కాటక రాశిపై నందగోపాలుడి మనసు ఉంటుంది. ఈ రాశి వారు భక్తి భావం పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపుతారు. ప్రియమైన వారి కోసం ఏ పని చేయడానికైనా వెనుకాడరు. ప్రతీ విషయాన్ని లోతుగా ఆలోచిస్తారు. చివరగా సరైననిర్ణయం తీసుకుంటారు. కుటుంబానికి రక్షణగా ఉంటారు. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. తోబుట్టువుల కోసం సాహం చేయడానికైనా వెనుకాడరు.

సింహా రాశి వారంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం. ఈ రాశి వారు ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడు సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ధైర్య సాహసాలు చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఏ పని చేపట్టినా దానిని పూర్తి చేసేంత వరకు వదలరు. వీరు ఒక రకంగా శ్రీకృష్ణుడిలా ప్రవర్తిస్తారు.

తులా రాశి వారిపై శ్రీకృష్ణుడి ఆశీర్వాదాలు ఎక్కువగానే ఉంటాయి.వీరు మంచి పనులు చేస్తూ సమాజంలో గౌరవం తెచ్చుకుంటారు. వీరు శ్రీకృష్ణుడికి సంబంధించి మంత్రాలు జపించడం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు. ఎక్కువగా సుఖ సంతోషాలను అనుభవిస్తారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ముందకు వస్తుంటారు. కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉంటారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version