https://oktelugu.com/

Mahesh Babu : మహేష్ బాబు ఇంట్లో రాఖీ వేడుక.. పంచుకున్న నమ్రత.. చూసి తీరాల్సిన ఫొటోలు

సూపర్ స్టార్ మహేష్ బాబుది లవ్లీ ఫ్యామిలీ. హీరోయిన్ నమ్రత శిరోద్కర్ ప్రేమ వివాహం చేసుకున్న మహేష్ బాబుకి ఇద్దరు సంతానం. కాగా గౌతమ్, సితారలు రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఘట్టమనేని కుటుంబంలో జరిగిన రాఖీ వేడుకలకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Written By:
  • S Reddy
  • , Updated On : August 20, 2024 / 01:10 PM IST

    Rakhi celebration at Mahesh Babu's house

    Follow us on

    Mahesh Babu : ఆగస్టు 20న రాఖీ పూర్ణిమ. దేశవ్యాప్తంగా ఉన్న అన్నా చెల్లెళ్ళు రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. సోదరులు తమ సోదరీమణులకు భరోసా ఇస్తూ రాఖీ కట్టించుకున్నారు. ఆశీర్వాదాలు అందుకున్నారు. ఇక టాలీవుడ్ సెలెబ్స్ రాఖీ పండగను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ లో పోస్ట్ చేశారు. వీటిలో సితార-గౌతమ్ ఫోటోలు నెటిజెన్స్ ని ఆకర్షించాయి. గౌతమ్-సితార గౌతమ్ రాఖీ వేడుకల ఫోటోలు నమ్రత శిరోద్కర్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.

    రాఖీ పౌర్ణిమ సాంప్రదాయాలు పూర్తి చేసిన సితార అన్నయ్య గౌతమ్ కి రాఖీ కట్టింది. ప్రత్యేకమైన బంధాలను జరుపుకునే ఆనందకరమైన క్షణాలు అని సదరు ఫోటోలకు నమ్రత కామెంట్ పెట్టింది. మహేష్ బాబు దంపతులకు పిల్లలు అంటే ప్రాణం. వారితో వీలైనంత ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నం చేస్తారు. ప్రతి ఏడాది ఐదారు విదేశీ ట్రిప్స్ కి వెళతారు. ఇష్టమైన ప్రదేశాల్లో విహరిస్తారు.

    మహేష్ బాబు తన ప్రతి సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు, రిలీజ్ తర్వాత కచ్చితంగా వెకేషన్ కి వెళతారు. మహేష్ పిల్లల్లో ఎవరికి వారే ప్రత్యేకం. సితార చిచ్చర పిడుగు. సితార ఆల్రెడీ సెలబ్రిటీ హోదా అనుభవిస్తుంది. పసిప్రాయంలోనే సోషల్ మీడియాలో అడుగుపెట్టిన స్టార్ అయ్యింది. సితార అప్పుడే ఓ యాడ్ లో నటించింది. ఓ ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ కి అంబాసిడర్ గా వ్యవహరించిన సితార రూ. 1 కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుందట.

    ఈ మొత్తాన్ని సితార ఛారిటీకి ఉపయోగించింది. సీతారకు బాలీవుడ్ తారలతో కూడా పరిచయాలు ఉన్నాయి. అలియా భట్ తో పాటు పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ సితారతో టచ్ లో ఉంటారు. భవిష్యత్ లో సితార నటి అయ్యే అవకాశం లేకపోలేదు. చిన్నప్పటి నుండి నాన్న సినిమాలు చూస్తూ పెరిగాను. నాకు నటన మీద ఆసక్తి ఉందని సితార చెప్పడం విశేషం.

    మరోవైపు గౌతమ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఓ మూవీ చేశాడు. మహేష్ బాబు-సుకుమార్ కాంబోలో వచ్చిన వన్ నేనొక్కడినే చిత్రంలో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రను గౌతమ్ చేశాడు. టీనేజ్ కి వచ్చిన గౌతమ్ త్వరలో హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశం కలదు. దీనిపై ఊహాగానాలు మొదలయ్యాయి. చదువు పూర్తి చేసిన గౌతమ్ హీరోగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యే ఆలోచనల్లో ఉన్నాడట. కృష్ణ ఫ్యామిలీ నుండి మూడో తరం హీరోగా గౌతమ్ రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

    అయితే సీతారకు భిన్నంగా గౌతమ్ చాలా రిజర్వ్డ్ గా ఉంటాడు. గౌతమ్ కి ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్స్ లేవు. పబ్లిక్ లో కూడా గౌతమ్ పెద్దగా కనిపించడు. మీడియా వెంటపడిన అవైడ్ చేస్తాడు. మరి హీరోగా గౌతమ్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. మరోవైపు రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు సిద్ధం అవుతున్నాడు. ఎస్ఎస్ఎంబీ 29 ఏకంగా రూ. 800 కోట్ల బడ్జెట్ తో నిర్మించనున్నారు. త్వరలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఎస్ఎస్ఎంబి 29 పాన్ వరల్డ్ మూవీగా విడుదల కానుంది.