Rashi Phalalu: ఈ రాశి వారి జీవితం ఈరోజు అల్లకల్లోలంగా ఉంటుంది..

Rashi Phalalu వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టడానికి ఇది అనువైన సమయం కాదు. ఉద్యోగులకు అధికారుల నుంచి సమస్యలు వచ్చే అవకాశం. స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడతాయి. ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువ.

Written By: Chai Muchhata, Updated On : January 20, 2024 10:33 am

Rashi Phalalu

Follow us on

Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 జనవరి 20న చంద్రుడు మేషరాశిలో సంచరించనున్నాడు. దీంతో ద్వాదశ రాశులపై కృత్తిక నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో మేషం నుంచి మీనం రాశివరకు కొందరిలో ధన లాభం ఉంటుంది. మరికొందరికి ప్రతికూల ఫలితాలు ఉండనున్నాయి. ఈ సందర్భంగా 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

మేషరాశి:
ఈ రాశి వారికి ఈ రోజు స్నేహితుల సహకారం ఉంటుంది. మానసిక ఒత్తిడి వల్ల ఆరోగ్యం పై ప్రభావం ఉంటుంది. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టేముందు ఇతరుల సలహాలు తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొందరు ప్రత్యర్థులు మీ పనులను చెడగొట్టే అవకాశం ఉంది.

వృషభం:
వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టడానికి ఇది అనువైన సమయం కాదు. ఉద్యోగులకు అధికారుల నుంచి సమస్యలు వచ్చే అవకాశం. స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడతాయి. ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువ.

మిథునం:
ఉద్యోగులకు కిందిస్థాయి సిబ్బందితో వాగ్వాదాలు ఉంటాయి. కొన్ని విషయంలో ఓపిక అవసరం. వ్యాపారస్తులు యంత్రాలకు సంబంధించిన అమ్మకాలపై జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో సభ్యులు ప్రశాంతంగా ఉంటారు.

కర్కాటకం:
ఈ రాశి వారి జీవితం ఈరోజు అల్లకల్లోలంగా ఉంటుంది. వ్యాపారస్తులు పర్యటనలు చేస్తారు. ఉద్యోగులు ఇతరులతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు సాంయమనం పాటించాలి.

సింహ:
కొత్త ఆదాయం వనరులు సమకూరుతాయి. ఉద్యోగులు కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు. రాజకీయ నాయకులకు అడ్డంకులు ఏర్పడతాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి.

కన్య:
మీ మాటల వల్ల కొన్ని వివాదాలు ఏర్పడే అవకాశం. ప్రియమైన వారితో గొడవలకు దిగకుండా ఉండాలి. వ్యాపారంలో పోటీ తత్వం పెరుగుతుంది. అయితే ఆదాయం పెరుగుతుంది. ఆశించిన పనులు ఆలస్యం అవుతాయి.

తుల:
ఇల్లు కట్టుకోవాలి అనుకునే వారికి అడ్డంకులు తొలగిపోతాయి. వ్యాపారస్తులకు లాభసాటి గానే ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వచ్చే అవకాశం. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.

వృశ్చికం:
కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో స్థిరంగా ఉంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. సంబంధాలు మెరుగుపడతాయి.

ధనస్సు:
ఖర్చులు పెరుగుతాయి. దీంతో టెన్షన్ వాతావరణం ఉంటుంది. వ్యాపారం లో అధిక లాభాలు ఉంటాయి. కుటుంబంలో చిన్నపాటి గొడవలు ఉంటాయి. ఆ తర్వాత సర్దుకుంటాయి.

మకర:
కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. స్నేహితులతో షికారుకు వెళ్తారు. పెట్టుబడులు పెట్టే వారికి అనుకూల సమయం. ఉద్యోగులు తమ విధుల విషయంలో తొందర పడొద్దు.

కుంభం:
గతంలో మొదలు పెట్టిన పనులు పూర్తవుతాయి. సంబంధాలు మెరుగవుతాయి. వ్యాపారులకు ఆశించిన లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు ప్రశంసలు దక్కుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

మీనం:
ఈరోజు ఇంటికి చుట్టాలు వస్తారు. కొన్ని శుభవార్తలు వింటారు. సోదరుల మద్దతు ఉంటుంది. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం. సాయంత్రం ఉల్లాసంగా గడుపుతారు.