Homeజాతీయ వార్తలుSonam Wangchuk : ఎవరీ సోనం వాంగ్ చుక్.. దేశవ్యాప్తంగా ఎందుకీ ఈ చర్చ

Sonam Wangchuk : ఎవరీ సోనం వాంగ్ చుక్.. దేశవ్యాప్తంగా ఎందుకీ ఈ చర్చ

Sonam Wangchuk : నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని.. కేంద్ర ప్రభుత్వం ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలని కొద్దిరోజులుగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రముఖ భారతీయ ఇంజనీర్.. విద్యాసంస్కర్త.. పర్యావరణవేత్త.. సామాజిక కార్యకర్త సోనం వాంగ్ చుక్ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన ఏ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోవడం లేదు. పైగా మరింతతీవ్రంగా దీక్ష చేస్తున్నారు.

సోనం వాంగ్ చుక్ ఆరోగ్యం క్షీణించి పోతున్న నేపథ్యంలో.. కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన చేస్తున్న దీక్ష శిబిరం నుంచి ఏ క్షణంలోనైనా తీసుకెళ్లి.. ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. వాంగ్ చుక్ దీక్షకు మొదట్లో అంతగా స్పందన లభించలేదు. అయితే ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా మారడంతో సోషల్ మీడియాలో ఉద్యమం మొదలైంది. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు నిరవధిక నిరసన దీక్షలో పెద్దగా పాల్గొన్నట్లు కల్పించడం లేదు. కేవలం చర్చ మొత్తం సోనం చుట్టూ తిరుగుతోంది.

సోనం స్వస్థలం లడక్. ఇతడు భారతీయ ఇంజనీర్. విద్యాసంస్కర్త.. పర్యావరణవేత్త.. సామాజిక కార్యకర్త కూడా.. హిమాలయాలలో పర్వత ప్రాంతాలలో ప్రజలు పడుతున్న సమస్యలకు ఈయన సహజసిద్దమైన పరిష్కార మార్గాన్ని చూపించారు. తద్వారా అంతర్జాతీయంగా గుర్తింపు సాధించారు.. సోనం జీవితం ఆధారంగానే హిందీలో ఓ సినిమాను రూపొందించారు. అందులో అమీర్ ఖాన్ పోషించిన ఫున్ సుక్ పాత్రకు ప్రేరణ సోనం.

సోనం లడక్ ప్రాంతంలో స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూమెంట్ ఆఫ్ లడక్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. పరీక్షలలో ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఆయన ప్రయత్నం మొదలుపెట్టారు. వారికి ప్రాక్టికల్ విధానంలో విద్యను అందించారు..

లడక్ ప్రాంతంలో శీతకాలంలో వృధాగా పోయే నీటిని మంచు కొండలుగా మార్చే విధానాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ ఐస్ స్తూపాలు వేసవికాలంలో రైతులకు సాగునీటి వనరుల మాదిరిగా ఉపయోగపడతాయి.

సోనం ప్రస్తుతం నీట్ అవకతవకలపై ఆందోళన చేస్తున్నారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ప్రధాన్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఆయన చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష 20వ రోజుకు చేరుకుంది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దీంతో ప్రధాన మీడియాలో సోనం గురించి విస్తృతంగా చర్చ నడుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version