Krishna Janmashtami : శ్రావణ మాసం ను ఆధ్యాత్మిక నెలగా పేర్కొంటారు. ఈ నెలలో వరుసగా శుభ దినాలు వస్తాయి. నాగ పంచమి మొదలు నుంచి శ్రీకృష్ణాష్టమి వరకు శ్రావణ మాసంలోనే వస్తాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణమాసంలోని కృష్ణ పక్షంలోని అష్టమి రోజున శ్రీకృష్ణాష్టమిని జరుపుకుంటారు. ఈరోజున శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల ఆయన అనుగ్రహం ఉంటుందని చాలా మంది ఆధ్యాత్మిక వేత్తలు చెబుతూ ఉంటారు. అయితే శ్రీకృష్ణ పూజ చేసేవారు ఇంట్లో ఉత్తర దిక్కులో దీపం పెట్టాలని చెబుతున్నారు. ఆ తరువాత బియ్యం పిడితో కృష్ణుడి రూపం తయారు చేసి పసుపు, కుంకుమతో అలంకరించాలి. ఇలా చేయడం వల్ల శుభప్రదం అని కొందరు పండితులు చెబుతున్నారు. శ్రీకృష్ణాష్టమి రోజున ప్రత్యేక పూజలు చేయడం మాత్రమే కాదని, కొన్ని వస్తువులను దానం ఇవ్వడం వల్ల గోపాలుడి అనుగ్రహం పొందుతారని అంటున్నారు. మరి ఈరోజు ఏయే వస్తువులు దానం చేయాలంటే?
శ్రీకృష్ణాష్టమి రోజున వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటారు. ఉదయం పూజలు నిర్వహించిన భక్తులు సాయంత్రం ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొంటారు. ఈరోజు ఉట్టి కొట్టే కార్యక్రమం కుదరని వారు మిగతా రోజుల్లో కూడా ఈ వేడుక నిర్వహించుకుంటుూ ఉంటారు. అయితే శ్రీకృష్ణాష్టమి రోజున కొన్ని వస్తువులు దానం చేయడం వల్ల మహా పుణ్యం దక్కించుకుంటారని అంటున్నారు. ఆ వస్తువులు శ్రీకృష్ణుడికి సంబంధించినవి అయితే ఇంకా మంచిదని అంటున్నారు.
గోదానం..:
శ్రీకృష్ణుడికి గోవులంటే చాలా ఇష్టం. ఆయన కథలో ఎక్కువగా గోవులతోనే కనిపిస్తాడు. అయితే గోకులాష్టమి రోజున గోదానం చేయడం వల్ల ఎంతో పుణ్యం చేసుకుంటారని కొందరు పండితులు చెబుతున్నారు. ఒకవేళ గోదానం చేయడం వీలుకాకపోతే ఈరోజు గోసేవ చేయాలి. గోవుకు ఇష్టమైన ఆహారం అందించాలి. దీంతో శ్రీకృష్ణుడు సంతోషిస్తాడు.
నెమలి ఈకలు ఇవ్వడం:
కృష్ణాష్టమి రోజు చిన్న పిల్లలను బాలగోపాలుడిగా తయారు చేస్తారు. వారిలో చిన్ని కృష్ణయ్యను చూసుకుంటారు. ఈ సందర్భంగా నెమలి ఈకలతో అలంకరిస్తారు. అయితే నెమలి ఈకలను కొందరికి దానం చేయడం వల్ల పుణ్యం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. శ్రీకృష్ణుడి తలలో ఉండే నెమలి ఈకలను దానం చేయడం వల్ల ధన లాభం జరుగుతుందని చెబుతున్నారు.
దుస్తుల దానం:
శ్రీకృష్ణాష్టమి రోజున ప్రత్యేక పూజలు చేయడంతో పాటు పేదలకు దానం చేయడం వల్ల మహా పుణ్యం దక్కుతుంది. ఈరోజు పేదవారికి నిత్యావసరాలైన దుస్తులను దానం చేయడం వల్ల వారికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే శ్రీకృష్ణుడు కూడా సంతోషిస్తాడు. అందువల్ల పేదవారికి వస్త్ర దానం చేయడం వల్ల కన్నయ్య అనుగ్రహం పొందుతారు.
వెన్న వితరణ:
చిన్ని కృష్ణుడిని వెన్నె దొంగ అని అంటారు. వెన్న అంటే శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టం. అందువల్ల ఈరోజు పేదలకు వెన్నను దానం చేయడం ఎంతో మంచిది. మరీ ముఖ్యంగా పేదవారింట్లో ఉన్ చిన్న పిల్లలకు వెన్న ఇవ్వడం వల్ల వారికి సంతోషాన్ని ఇచ్చిన వాళ్లవుతారు. దీంతో శ్రీకృష్ణుడి అనుగ్రహం ఉంటుంది. దీంతో దానం చేసిన వారి ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది.